ఎస్వీయూలో రాసలీలలు.. ఇద్దరి సస్పెన్షన్ | svu employees caught in cc camera footage, suspended | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో రాసలీలలు.. ఇద్దరి సస్పెన్షన్

Published Mon, Jul 6 2015 2:39 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

ఎస్వీయూలో రాసలీలలు.. ఇద్దరి సస్పెన్షన్ - Sakshi

ఎస్వీయూలో రాసలీలలు.. ఇద్దరి సస్పెన్షన్

ఎస్వీ యూనివర్సిటీలో ఓ ఉద్యోగి సహచర ఉద్యోగితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ శృంగార లీలలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పుటేజీలను పరిశీలించిన అధికారులు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. ఎస్వీయూ కోఆపరేటివ్ స్టోర్స్ ఇండేన్ గ్యాస్ కార్యాలయంలోని ఓ క్లర్కు అక్కడి స్వీపర్ తో కార్యాలయంలోనే కొంత కాలంగా రాసలీలలు కొనసాగిస్తున్నాడు. జూన్ 28న కార్యాలయంలోనే రాసలీలలు సాగి స్తుండగా అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఉద్యోగి వ్యవహారంపై స్టోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

కోఆపరేటివ్ స్టోర్స్ ఉపాధ్యక్షుడు జానకిరామయ్య, మిగిలి న ఆరుగురు డైరెక్టర్ల సమక్షంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. పుటేజీల్లో ఉన్నది స్టోర్స్ ఉద్యోగులేనని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జానకిరామయ్య వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మళ్లీ ప్రయత్నాలు
ఈ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన క్లర్క్ విధుల్లో చేరడానికి అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాజకీయ ఒత్తిడితో ఆ క్లర్క్ ను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంతో విద్యార్థులు మండిపడుతున్నారు. వారిద్దరినీ సస్పెండ్ చేయడం కాదని, విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement