ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులతో తలపెట్టిన సమావేశానికి అనుమతి నిరాకరించారు. ప్రత్యేక హోదా కోసం యూనివర్సిటీల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి విషయాలపై ఎస్వీయూలో విద్యార్థులతో సదస్సు నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు యూనివర్సిటీ అధికారుల అనుమతి కోరారు. అయితే, ప్రత్యేక హోదా, రాజకీయ సభలకు యూనివర్సిటీల్లో అనుమతి ఇవ్వరాదంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. అర్ధాంతరంగా యూనివర్సిటీల్లో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు.
Published Sun, Sep 13 2015 7:37 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement