ఎస్వీయూలో ఫీజుల మోత | sv degree of increase in fees | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో ఫీజుల మోత

Published Sat, Jul 4 2015 1:50 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

ఎస్వీయూలో  ఫీజుల మోత - Sakshi

ఎస్వీయూలో ఫీజుల మోత

పెరిగిన డిగ్రీ ఫీజులు
బెంబేలెత్తున్న విద్యార్థులు

 
ఎస్వీ యూనివర్సిటీ అధికారులు పేద విద్యార్థులతో చెడుగుడు ఆడేస్తున్నారు. అడపాదడపా ఫీజులు పెంచుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గత ఏడాది ఫీజు తరగుతుల ఫీజులు రెట్టింపు చేసి, ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో మరింత మోత మోగిస్తున్నా రు. భారీ మొత్తంలో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.
 
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఫీజుల రూపంలో వాతపెడుతున్నారు. కోటి ఆశలతో కళాశాలల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న విద్యార్థులను ఫీజుల మోత బాధిస్తోంది. గత ఏడాది క్యాంపస్‌లోని హాస్టల్ ఫీజులు, పరీక్ష ఫీజులు, వివిధ రకాల సర్టిఫికెట్లకు ఫీజులను యూనివర్సిటీ యంత్రాంగం భారీగా పెం చింది. ఈ ఏడాది పీజీ, ఫీజుల రూపంలో వాతపెట్టిన అధికారులు ఇప్పుడు డిగ్రీ ఫీజులను కూడా పెంచింది. డిగ్రీ చేరాలని కళాశాలకు అడ్మిషన్ కోసం అడుగుపెట్టిన విద్యార్థులకు పగలే చుక్కలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలో ఫీజులను 50 శాతం పెంచిన యూనివర్సిటీ పెంచిన ఫీజులను వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియచెప్పలేదు. గత ఏడాది ఫీజులు చూసి అంతే ఫీజు ఉంటుందని భావించిన అడ్మిషన్ కోసం వెళ్లితే పెంచిన ఫీజులను చల్లగా చెబుతుంటే తల్లిదండ్రుల గుండెలు జారి పోతున్నాయి.
 
50 శాతం పెంపు
 ఎస్వీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేరేందుకు గత ఏడాది రూ.4500  వసూలు చేసేవారు. ఈ ఫీజు ప్రభుత్వ కళాశాలల్లో వసూలు చేసే ఫీజు. ఆ ఫీజును ఈ ఏడాది రూ.7070కి పెంచారు. అంటే రూ.2570 ఫీజు పెరిగింది. అంటే దాదాపు 57 శాతం పెరుగుదల ఉంది. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ఆ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎస్వీయూ పరిధిలో 135 కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ కళాశాలలు, 5 టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగిలిన 116 డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ యాజమాన్యాలకు చెందినవి. వీటిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఉన్నారు. బీకాంలో 30 వేలు, బీఎస్సీలో 16 వేలు, బిఏలో 4500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే మొదటి సంవత్సరంలో దాదాపు 17 వేల మంది కొత్తగా డిగ్రీలో చేరుతున్నారు. యూనివర్సిటీ పెంచిన ఫీజుల వల్ల ఒక్కో విద్యార్థిపై రూ.2570 భారం పడుతుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులపై యూనివర్సిటీ రూ.4.3 కోట్ల భారం మోపుతోంది.
 
పీజీ కోర్సులకు పెంపు
 ఎస్వీయూలో ఈనెల నుంచి పీజీ అడ్మిషన్లు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు. దీని ప్రకారం ఎంఏలో చేరేవారు రూ.6,315, ఎంకాం అభ్యర్థులు రూ.8 వేలు, ఎంఎస్సీ విద్యార్థులు రూ.10,185 చెల్లించాలి.కొన్ని  సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులకు మెయింటెన్స్ పేరిట ఏకంగా రూ.10 వేలు పెరిగింది. ఎస్వీయూ, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో దాదాపు 4 వేల మంది చేరతారు. పెంచిన ఫీజులతో విద్యార్థులపై మరో రూ.2 కోట్ల భారం పడనుంది. అంటే ఏడాది కాలంలో ఎస్వీయూ పరిధిలో పీజీ, డిగ్రీ విద్యార్థుల పైన, దాదాపు రూ.6.5కోట్ల భారం మోపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement