సాక్షి, అమరావతి: శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ వర్సిటీ) పరిధిలో అర్హతలు లేకున్నా 138 ప్రైవేట్ కాలేజీ లకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, సీఐడీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశిం చాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. చిత్తూరు జిల్లాకు చెందిన విలేకరి బి.దొరస్వామి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమాన్లు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ దర్మాసనం విచారణ జరిపింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్వీ వర్సిటీని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. అర్హత లేకపోయినా అనుబంధ గుర్తింపు పొందిన 138 కళాశాలలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల లబ్ధి పొందాయని పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.
ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపుపై కౌంటర్ వేయండి
Published Thu, Nov 4 2021 4:57 AM | Last Updated on Thu, Nov 4 2021 4:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment