తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతూ శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) విద్యార్థులు గురువారం యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు టెంట్ను పీకి వేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. శాంతియుతంగా తాము దీక్ష చేస్తుంటే భగ్నం ఎందుకు చేస్తున్నారని పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు.
పోలీసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ లాఠీలకు పోలీసులు పని చెప్పారు. పోలీసుల చర్యలకు నిరసనగా యూనివర్శిటీ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ...గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో బుధవారం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.