యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు బాటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఆక్వాకల్చర్, ఆంథ్రోపాలజీ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తొలుత బాటనీ, కెమిస్ట్రీ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై అడ్మిషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బాటనీలో మొదటి ర్యాంకు సాధించిన సి.ముబారిషా, రెండో ర్యాంకు సాధించిన ఎన్.శాంతికి ఆయన అడ్మిషన్ ఇచ్చారు. కెమిస్ట్రీలో మూడవ ర్యాంకు సాధించిన జ్యోతిర్మయి, నాల్గవ ర్యాంకు సాధించిన ఎన్.లీలకు రిజిస్ట్రా ర్ కె.సత్యవేలురెడ్డి అడ్మిషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎస్వీ యూనివర్సిటీ ఎంతో మంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిందన్నారు. ఇక్కడ చదివిన వారు దేశ, విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. పలు సంస్థల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. శ్రీవారి పాదాల చెంత వెలసిన ఎస్వీయూ క్యాంపస్‌లో సీటు రావడం ఎంతో అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ డెరైక్టర్ పి.భాస్కర్‌రెడ్డి, పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్‌బాబు, మాజీ డెరైక్టర్ బి.కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
424మందికి అడ్మిషన్ల: శుక్రవారం 424 మందికి అడ్మిషన్లు ఇచ్చామని అడ్మిషన్ల విభాగం డెరైక్టర్ పాటూరి భాస్కర్‌రెడ్డి తెలిపారు. 297 మంది క్యాంపస్ కళాశాలల్లో చేరారన్నారు. సైన్స్ కళాశాలలో 195 మంది, ఆర్ట్స్‌లో 102 మంది చేరారన్నారు.
హెల్ప్‌లైన్ డస్క్‌లు : పీజీ కౌన్సెలింగ్ కు హాజరైనవారి కోసం విద్యార్థి సంఘా లు హెల్ప్‌లైన్ డస్క్‌లు ఏర్పాటు చేశా యి వైఎస్సార్‌సీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏబీ వీపీ, ఐఎస్‌ఎఫ్, జీవీఎఫ్, టీఎస్‌ఎఫ్ హెల్ప్‌లైన్ డస్క్‌లు ఏర్పాటు చేశాయి.పీసీలు లేక ఇక్కట్లు : కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ప్రొవిజన్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు లేక ఇబ్బం ది పడ్డారు. డిగ్రీ ఫలితాలు విడుదల చేసి రెండు వారాలు గడిచినా విద్యార్థులకు ప్రొవిజన్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు పంపలేదు.
ప్రైవేటు బేజారు : శుక్రవారం కెమిస్ట్రీ సబ్జెక్టుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కోర్సు పలు ప్రైవేటుకళాశాలల్లో నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలల్లో వసతులు సరిగా లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు కళాశాలల్లో చేరడంలేదు. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేశారు.
ఎస్వీయూలో పీజీ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Sat, Jul 5 2014 4:58 AM | Last Updated on Fri, May 25 2018 3:26 PM
Advertisement