దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలనే అంశంపై తీసిన ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. మనిషికి విద్య, వైద్యం ఎంతో అవసరమని, ఇవి ప్రైవేట్ రంగంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. యూనివర్సిటీ చిత్రాన్ని విద్యార్థులందరూ ఆదరించాలని ఆయన కోరారు. అక్టోబర్ 4వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులతో మాట్లాడతూ.. 'సినిమాలో పదో తరగతి పేపర్ లీకేజీ దగ్గర నుంచి గ్రూప్స్ పరీక్షల పేపర్ లీకేజీలపై చూపించాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా రూ. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోటా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లిదండ్రుల కలలన్నీ ప్రభుత్వాలు కల్లలు చేస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను సినిమాను తెరకెక్కించాం. ' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment