తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో యూనివర్సిటీ ఉద్యోగి జగదీష్ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం విద్యుత్ వైర్లు రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండానే సిబ్బందిని అధికారులు కరెంట్ పోల్ ఎక్కించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి అధికారులే కారణమంటూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల 13 న ఎస్వీ లో జరిగిన బాహుబలి ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్ లైన్ ను తొలిగించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఎస్వీయూ లో షార్ట్ సర్క్యూట్ : ఉద్యోగి మృతి
Published Fri, Jun 26 2015 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement