employee died
-
కూర్చున్న చోటే కుప్పకూలిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన జరిగింది. గోమతినగర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగిని ఆఫీసులోనే తన డెస్క్‌లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి మరణించింది. గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. గమనించిన తోటి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెబుతున్నారు.ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.ఇక ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటన దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తడిని ప్రతిబింబిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు. -
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
అది శిథిలమైన భవనమే.. దానిలోనే ఆ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదో రోజు అది కూలిపోయే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఫలితం శూన్యం. ఆ పురాతన కట్టడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆ భవనంలో ఓ భాగం శ్లాబు కుప్పకూలి దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్(ఓఎస్)గా పనిచేస్తున్న మట్టపర్తి ఆదిలక్ష్మి(46) ఈ దురదృష్టకర సంఘటనకు బలైంది. కొత్తపేట: బ్రిటిష్ పాలకులు నిర్మించిన వివిధ కార్యాలయాల భవన సముదాయం శ్లాబు బలహీన పడి శిథిలావస్థకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సబ్ ట్రెజరీ రెండో గది భాగం శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న ఓఎస్ మట్టపర్తి ఆదిలక్ష్మి ఆ శ్లాబు శిథిలాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు, పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించి, ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి చిన్నప్పటి నుంచి రెండు కాళ్లు పోలియోతో చంక కర్రల సాయంతో నడుస్తుంది. డిగ్రీ చదివిన ఆమె సుమారు పదేళ్ల నుంచి ఉద్యోగానికి ప్రయత్నించగా, 2016 జూలైలో ఉపాధి కల్పన శాఖ పీహెచ్సీ కోటాలో సబ్ ట్రెజరీకి ఎంపిక చేసింది. కొత్తపేట సబ్ ట్రెజరీలో ఓఎస్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు ఈ విధంగా ఆమె తనువు చాలించడం విచారకరం. వర్షం నీటి చెమ్మతో తప్పిన పెను ప్రమాదం ఆ కార్యాలయంలో ఎస్టీఓతో పాటు ఎనిమిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే పలువురు ఉద్యోగులు మధ్యాహ్న భోజనానికి తమ ఇళ్లకు వెళ్లగా, మిగిలిన వారు కార్యాలయంలో ప్రమాదం జరిగిన గదిలోనే భోజనం చేసి సేద తీరేవారు. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున నీరు కారుతూ చెమ్మగిల్లింది. దాంతో ఓఎస్ ఆదిలక్ష్మి మినహా మిగిలిన వారందరూ మొదటి గది, లోపలి గదిలో వారివారి టేబుళ్ల వద్ద భోజనం చేసి కూర్చున్నారు. ఆదిలక్ష్మి మాత్రం ఆ గదిలోనే భోజనం చేసి కూర్చుంది. అదే సమయంలో ఒక్కసారిగా శ్లాబు కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయింది. నాలుగేళ్లుగా ‘సాక్షి’ హెచ్చరిçస్తూనే ఉన్నా.. 1898లో అప్పటి బ్రిటిష్ పాలకులు తాలూకా పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం రాతి కట్టుబడితో మద్రాస్ టెర్రస్ (గానుగు సున్నం) శ్లాబుతో నిర్మించారు. దానిలో తహసీల్దార్, సబ్ ట్రెజరీ, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్ర కార్యాలయాలున్నాయి. గతంలో అగ్నిమాపక కేంద్రం విభాగాన్ని ఆ శాఖ వారు ఆధునికీకరించుకోగా, రెవెన్యూ, సబ్ ట్రెజరీ కార్యాలయాల విభాగాలు నీరుకారుతూ శిథిలావస్థకు చేరాయి. ఏమాత్రం వర్షం కురిసినా నీరు కారుతోంది. సీలింగ్‌కు టార్పాలిన్, సంచులు కట్టుకుని వర్షం నీటి నుంచి రక్షణ పొందుతూ, రికార్డులను భద్రపరుచుకుంటూ ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆధునికీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడమే తప్ప వాటికి మోక్షం లభించలేదు. గత ఏడాది సెప్టెంబర్ 15న సాక్షిలో ‘పరిరక్షించుకుంటే పదిలం’, గత నెల 12న ‘పురాతన భవనాన్ని పదిలం చేద్దాం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. -
టీడీపీ నేతల అవినీతికి ఉద్యోగి బలి
కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నేతల అవినీతికి ఓ చిరుద్యోగి బలయ్యాడు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నైట్ వాచ్ మెన్ గా పనిచేసే నరసింహులు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీకి చెందిన ఛైర్పర్సన్ సురయభాను, వైస్ ఛైర్పర్సన్ వసంత కారణమని నరసింహులు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న నరసిహులును ఉద్యోగం నుంచి తొలగిస్తామని.. రూ. 60 వేలు డబ్బు ఇస్తే విధుల్లో కొనసాగిస్తామని వారు బెదిరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. డబ్బు ఎలా కట్టాలో తెలియక అవేదన చెందిన నరసింహులు గుండెపోటుతో మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. నరసింహులు మృతదేహంతో ధర్నా చేశారు. ఈ ఆందోళనకు వైఎస్సార్ సీపీ కదిరి ఇంఛార్జి డాక్టర్ సిద్ధారెడ్డి మద్దతు తెలిపారు. -
లిఫ్ట్ చైన్ తెగి యువకుడి దుర్మరణం
హైదరాబాద్ : కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ చైన్ తెగి యువకుడు దుర్మరణం చెందాడు. కూకట్పల్లి ఎస్ఐ వెంకన్న కథనం ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన సంద్రి రవితేజ (18) మూసాపేట హబీబ్‌నగర్‌లో ఉంటూ ప్రశాంత్‌నగర్‌లోని రికా లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం పని నిమిత్తం కంపెనీకి వెళ్లాడు. ఆఫీసుకు సంబంధించిన సరుకును లిఫ్ట్‌లో నుంచి దించుతుండగా 3వ అంతస్తులో ఉండగానే లిఫ్ట్ చైన్ తెగి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసిన విద్యుత్ తీగ
ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి ఓ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. - ఎస్వీయూలో విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి - మరో ఉద్యోగి పరిస్థితి ఆందోళనకరం - బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన యూనివ ర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో విద్యుదాఘాతంతో విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... ఎస్వీయూలోని టెన్నిస్ కోర్టు వద్ద శుక్రవారం వీధిలైట్ వెలగకపోవడంతో రిపేరు చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అక్కడి హెల్పర్లు, టైమ్ స్కేల్ ఉద్యోగులైన మురళి, జగదీష్‌ను ఆదేశించారు. వారి ద్దరూ విద్యుత్ సరఫరా ఆఫ్ చేసి ఆపై స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. ఇంతలో మురళి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న జగదీష్(38) అతన్ని రక్షించబోయి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడిపోయాడు. ఆపై కొంతసేపటికే గిలాగిలా కొట్టుకుంటూ జగదీష్ ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న స్థానికులు మురళిని స్విమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. జగదీష్ మృతదేహాన్ని నిచ్చెన నుంచి అతి కష్టంమీద కిందికి దింపారు. ఇలావుండగా మురళి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆ నిర్లక్ష్యమే కారణమా? ఎస్వీయూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని సిబ్బంది భావిస్తున్నారు. 13న ఎస్వీయూ స్టేడియంలో బాహుబలి ఆడియో వేడుకకు ఎస్వీయూ నుంచి 11 కేవీ విద్యుత్ లైను నుంచి కనెక్షన్ ఇచ్చారు. ఫంక్షన్ అనంతరం దానిని తొలగించలేదు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు మరిచిపోయారు. మరమ్మతుల సమయంలో సిబ్బంది కరెంట్ ఆఫ్ చేసినా స్టేడియం నుంచి వచ్చే వైర్‌కు విద్యుత్ రావడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో, కుటుంబ సభ్యులకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం పరిపాలనా భవనం వద్ద జగదీష్ మృతదేహంతో ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుబ్రమణ్యంరెడ్డి, మధుసూదన్‌నాయుడు, ఎన్ ఎంఆర్‌ల అధ్యక్షుడు నాగవెంకటేశ్, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, హే మంతకుమార్, మురళీధర్ పాల్గొన్నారు. రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా జగదీష్ కుటుంబాన్ని ఆదుకుంటామని వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ జయశంకర్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా, జగదీష్ భార్యకు టైంస్కేల్ ఉద్యోగాన్ని ప్రకటించారు. -
ఎస్వీయూ లో షార్ట్ సర్క్యూట్ : ఉద్యోగి మృతి
తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో యూనివర్సిటీ ఉద్యోగి జగదీష్ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం విద్యుత్ వైర్లు రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండానే సిబ్బందిని అధికారులు కరెంట్ పోల్ ఎక్కించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి అధికారులే కారణమంటూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల 13 న ఎస్వీ లో జరిగిన బాహుబలి ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్ లైన్ ను తొలిగించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. -
విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో ప్రమాదం...ఒకరి మృతి