టీడీపీ నేతల అవినీతికి ఉద్యోగి బలి
Published Sat, Jul 1 2017 2:16 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట‍్టణంలో టీడీపీ నేతల అవినీతికి ఓ చిరుద్యోగి బలయ్యాడు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నైట్ వాచ్ మెన్ గా పనిచేసే నరసింహులు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీకి చెందిన ఛైర్‌పర‍్సన్ సురయభాను, వైస్ ఛైర్‌పర‍్సన్ వసంత కారణమని నరసింహులు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న నరసిహులును ఉద్యోగం నుంచి తొలగిస్తామని.. రూ. 60 వేలు డబ్బు ఇస్తే విధుల్లో కొనసాగిస్తామని వారు బెదిరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. డబ్బు ఎలా కట్టాలో తెలియక అవేదన చెందిన నరసింహులు గుండెపోటుతో మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. నరసింహులు మృతదేహంతో ధర్నా చేశారు. ఈ ఆందోళనకు వైఎస్సార్ సీపీ కదిరి ఇంఛార్జి డాక్టర్ సిద్ధారెడ్డి మద్దతు తెలిపారు.
Advertisement
Advertisement