అమ్మకు ప్రేమతో..
► ఎస్వీయూ పీజీసెట్‌లో
► 4వ ర్యాంక్ సాధించిన ఈశ్వర్
► కూలిపనులు చేస్తూ కుమారున్ని చదివించిన అమ్మ
కర్నూలు సీక్యాంప్: తాను చదువుకోకపోయినా కుమారున్ని మాత్రం ఉత్తమంగా చదివిస్తోంది ఆ తల్లి. కూలి పనులు చేస్తూ వచ్చినంతలోనే కుమారుని చదువుకు ఏ ఆటంకం లేకుండా చూస్తోంది. కుమారుడు కూడా తల్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత మాత్రం ఒమ్ము చేయడం లేదు. ఎస్వీ యూనివర్సిటీ పీజీ సెట్ కామర్స్ విభాగంలో 4వ ర్యాంకు సాధించి అమ్మకు ప్రేమతో కానుకగా ఇచ్చాడు. 20 ఏళ్లుగా క్యాంప్‌లోని పూరిగుడిసెలో ఉంటున్న పుల్లమ్మ ఏమీ చదువుకోలేదు. కొడుకు ఈశ్వర్‌ను మాత్రం కూలి డబ్బుతోనే చిన్నప్పటి నుంచి చదివించింది. ఈ నెల 25న విడుదలైన ఎస్వీ యూనివర్శిటీ పీజీ సెట్ కామర్స్ ఫలితాల్లో ఈశ్వర్ 4వ ర్యాంక్ సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.