శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్వీ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక బలవన్మరణానికి పాల్పడింది. గీతిక మరణం వెనుక గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. గత వారం ఎస్వీ మెడికల్ కాలేజీలో శిల్ప ఆత్మహత్య ఉదంతం మరిచిపోక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రొఫెసర్ల వేధింపులపై గత కొంతకాలంగా మెడికోలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.