జనవరి 3న తిరుపతికి ప్రధాని
► అదే రోజు ఎస్వీయూలో ఐఎస్‌సీ ప్రారంభం
►ఏర్పాట్లపై ఈనెల 16న తిరుపతిలో సీఎం సమీక్ష
►అధికారులందరూ బాధ్యతగా మెలగాలి
►కమిటీల కన్వీనర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనవరి 3 నుంచి 7 వరకూ తిరుపతిలో జరిగే జాతీయ స్థారుు ఇండియన్స సైన్స్ సభలను అధికారులందరూ విజయవంతం చేయాలనీ, ఇందుకోసం వివిధ కమిటీల కన్వీనర్లు బాధ్యతగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించారు. మొదటి రోజైన జనవరి 3న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి చేరుకుంటారనీ, ఆయన చేతుల మీదుగానే సైన్‌స కాంగ్రెస్ ప్రారంభం జరుగుతుందన్నారు. ప్రధాని రాకను ధృవీకరిస్తూ పీఎంవో నుంచి ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వీయూ ఆవరణలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారిక రివ్యూలో కలెక్టర్ పాల్గొన్నారు. సైన్‌స కాంగ్రెస్ సభల నిర్వహణ కోసం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. రిసెప్షన్, రవాణా, బస, భోజనం, విద్యుత్, ప్రచారం, మేనేజ్‌మెంట్ తదితర కమిటీల్లో ఉన్న కన్వీనర్లు, కోకన్వీనర్లు తమకు కేటారుుంచిన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు.
రానున్న 15 రోజులు కీలకమైనవి కాబట్టి అధికారులు సాధ్యమైనంత వరకూ సెలవులను పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులు, వీవీఐపీలను అత్యంత జాగ్రత్తగా, ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వారికిచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నారు. తిరుపతిలో జరిగేది ప్రపంచస్థారుు సైన్‌స పండుగగా కలెక్టర్ అభివర్ణించారు. సైన్‌స కాంగ్రెస్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ డీ. నారాయణరావు మాట్లాడుతూ, ఈనెల 16న సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలో మరోసారి సమీక్ష జరిపే అవకాశముందన్నారు. ఇప్పటివరకూ అన్ని విభాగాల్లోనూ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 20 నాటికి నూరు శాతం ఏర్పాట్లు పూర్తవుతాయని వివరించారు. సమీక్షలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పండాదాస్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, టీటీడీ జేఈవో ప్రోలా భాస్కర్, మహిళా యూనివర్సిటీ వీసీ డాక్టర్ దుర్గాభవానీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిపుణుల సలహా మేరకే చెట్లు నరికివేత
ఇస్కా సభల నిర్వహణ పేరుతో అధికారులు వర్సిటీ ఆవరణలోని అందమైన, భారీ చెట్లను నరికివేస్తున్నారు. పరిపాలన భవనం పక్కనే ఉన్న 40 ఏళ్ల నాటి వృక్షాలను కూడా నేలకూల్చారు. నీడనిచ్చే చెట్లను నరికివేస్తుంటే చూపరుల ప్రాణం ఉసూరుమంటోంది. ఇదే విషయాన్ని పాత్రికేయులు ఎస్వీయూ వీసీ డాక్టర్ దామోదరం దగ్గర ప్రస్తావించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వర్సిటీ భవనాలు కొన్ని చెట్ల కారణంగా పటిష్టత కోల్పోతున్నాయనీ, అంతేకాకుండా వివిధ రకాల అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగిస్తున్నామని వీసీ డాక్టర్ దామోదరం బదులిచ్చారు. అశోక, యూకలిప్టస్ చెట్ల వల్ల భవనాలకు నష్టం వాటిల్లుతుందనీ, ఉద్యానవన శాఖ నిపుణుల సూచనల మేరకు అటువంటి చెట్లను తొలగిస్తున్నామన్నారు. నష్టపోయే పచ్చదనాన్ని భర్తీ చేసేందుకు వర్సిటీ ఆవరణలో 7 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు.