CM review
-
TS:సీఎం ఆదేశించినా ఆబ్సెంట్..రివ్యూకు రాని ట్రాన్స్‌కో సీఎండీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని ప్రభాకర్‌రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. ఇదీచదవండి..జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు -
జనవరి 3న తిరుపతికి ప్రధాని
► అదే రోజు ఎస్వీయూలో ఐఎస్సీ ప్రారంభం ►ఏర్పాట్లపై ఈనెల 16న తిరుపతిలో సీఎం సమీక్ష ►అధికారులందరూ బాధ్యతగా మెలగాలి ►కమిటీల కన్వీనర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనవరి 3 నుంచి 7 వరకూ తిరుపతిలో జరిగే జాతీయ స్థారుు ఇండియన్స సైన్స్ సభలను అధికారులందరూ విజయవంతం చేయాలనీ, ఇందుకోసం వివిధ కమిటీల కన్వీనర్లు బాధ్యతగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించారు. మొదటి రోజైన జనవరి 3న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి చేరుకుంటారనీ, ఆయన చేతుల మీదుగానే సైన్స కాంగ్రెస్ ప్రారంభం జరుగుతుందన్నారు. ప్రధాని రాకను ధృవీకరిస్తూ పీఎంవో నుంచి ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వీయూ ఆవరణలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారిక రివ్యూలో కలెక్టర్ పాల్గొన్నారు. సైన్స కాంగ్రెస్ సభల నిర్వహణ కోసం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. రిసెప్షన్, రవాణా, బస, భోజనం, విద్యుత్, ప్రచారం, మేనేజ్మెంట్ తదితర కమిటీల్లో ఉన్న కన్వీనర్లు, కోకన్వీనర్లు తమకు కేటారుుంచిన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న 15 రోజులు కీలకమైనవి కాబట్టి అధికారులు సాధ్యమైనంత వరకూ సెలవులను పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులు, వీవీఐపీలను అత్యంత జాగ్రత్తగా, ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వారికిచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నారు. తిరుపతిలో జరిగేది ప్రపంచస్థారుు సైన్స పండుగగా కలెక్టర్ అభివర్ణించారు. సైన్స కాంగ్రెస్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ డీ. నారాయణరావు మాట్లాడుతూ, ఈనెల 16న సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలో మరోసారి సమీక్ష జరిపే అవకాశముందన్నారు. ఇప్పటివరకూ అన్ని విభాగాల్లోనూ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 20 నాటికి నూరు శాతం ఏర్పాట్లు పూర్తవుతాయని వివరించారు. సమీక్షలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పండాదాస్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, టీటీడీ జేఈవో ప్రోలా భాస్కర్, మహిళా యూనివర్సిటీ వీసీ డాక్టర్ దుర్గాభవానీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిపుణుల సలహా మేరకే చెట్లు నరికివేత ఇస్కా సభల నిర్వహణ పేరుతో అధికారులు వర్సిటీ ఆవరణలోని అందమైన, భారీ చెట్లను నరికివేస్తున్నారు. పరిపాలన భవనం పక్కనే ఉన్న 40 ఏళ్ల నాటి వృక్షాలను కూడా నేలకూల్చారు. నీడనిచ్చే చెట్లను నరికివేస్తుంటే చూపరుల ప్రాణం ఉసూరుమంటోంది. ఇదే విషయాన్ని పాత్రికేయులు ఎస్వీయూ వీసీ డాక్టర్ దామోదరం దగ్గర ప్రస్తావించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వర్సిటీ భవనాలు కొన్ని చెట్ల కారణంగా పటిష్టత కోల్పోతున్నాయనీ, అంతేకాకుండా వివిధ రకాల అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగిస్తున్నామని వీసీ డాక్టర్ దామోదరం బదులిచ్చారు. అశోక, యూకలిప్టస్ చెట్ల వల్ల భవనాలకు నష్టం వాటిల్లుతుందనీ, ఉద్యానవన శాఖ నిపుణుల సూచనల మేరకు అటువంటి చెట్లను తొలగిస్తున్నామన్నారు. నష్టపోయే పచ్చదనాన్ని భర్తీ చేసేందుకు వర్సిటీ ఆవరణలో 7 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. -
మేయర్ చాంబర్లో సీఎం మకాం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను సీఎం చంద్రబాబు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం కౌన్సిల్ హాల్లో మేయర్ పోడియం వద్ద ప్రత్యేక వేదిక నిర్మిస్తున్నారు. కౌన్సిల్ హాల్ సమీపంలోని టౌన్‌ప్లానింగ్ ఆన్లైన్ విభాగం, సెక్రటరీ సెల్‌ను ఖాళీ చేయించారు. ఉన్నతాధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సోఫాలు, కుర్చీలు, మైక్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీన యుద్ధప్రాతిపదికన ప్రారంభమైన పనులు 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తొలుత మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసే అద్దాల మందిరం నుంచి సీఎం పర్యవేక్షణ ఉండాలని భావించారు. అధికారులతో సమీక్షలు, ప్రెస్మీట్లు అన్నీ అక్కడే నిర్వహిస్తారు. ఆ ప్రాంతంలో సీఎం మకాం పెడితే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీస్ శాఖ సూచించింది. ఈ క్రమంలో వేదికను నగరపాలక సంస్థ కార్యాలయానికి మార్చారు. 12 రోజులూ కార్పొరేషన్లోనే.. పుష్కరాలు జరిగే 12 రోజులూ సీఎం కార్పొరేషన్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారు. సీఎం ఉండేందుకు అనువుగా మేయర్ చాంబర్లో వసతుల కల్పన చేపట్టారు. మంత్రులు, ముఖ్య అధికారులతో ఆంతరంగిక చర్చలన్నింటినీ సీఎం మేయర్ చాంబర్లోనే నిర్వహిస్తారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలను కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తారు. సీఎం, ఇతర అధికారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పడమర వైపు ఉన్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్, యూసీడీ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) షెడ్‌ను కూల్చివేశారు. పడమర వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్, పక్కన కొత్తగా ఏర్పాటుచేస్తున్న గేటు నుంచి అధికారుల వాహనాలు కార్యాలయంలోకి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇక్కడే మీడియా పాయింట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ హాల్ చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ కాంతులు అమరుస్తున్నారు. -
పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్... జేసీ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్వర్తించాల్సిన విధులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకల నిర్వహణకు ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతంని నియమించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వేడుకలకు పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ట్రాఫిక్ ఐలాండ్లు, వేడుకలు జరుగనున్న పీటీసీ మైదానాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించాలని కార్పొరేషన్ కమిషనర్ చల్లాఓబుళేసు, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మైదానాన్ని అందంగా అలంకరించడంతో పాటు 10 సై్క బెలూన్లను ఏర్పాటు చేయాలని డ్వామా పీడీ నాగభూషణంని ఆదేశించారు. -
ఒకే యూనియన్‌కు ఆహ్వానమా?
సమీక్షకు టీఎంయూను మాత్రమే పిలవడంపై ఈయూ, టీఎస్ ఎన్ఎంయూ ఆగ్రహం ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించటమేనని విమర్శ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై సీఎం సమీక్షా సమావేశానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలను మాత్రమే ఆహ్వానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఎంయూను మాత్రమే ఆహ్వానించారని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ మండిపడ్డాయి. ఓవైపు సీఎం సమీక్ష సమావేశం జరుగుతుండగా ఈ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని... ఇలాంటి తరుణంలో ఒక సంఘానికి అనుకూలంగా ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపించాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంయూకు అనుకూల ఫలితాలు రావటానికే ఇలా చేశారని, దీనిపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించడం ఏమిటని టీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, లక్ష్మణ్, రఘురాం, ఈయూ నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాల నేతలు ఉంటే అధికారుల బండారం బయటపడుతుందన్న భయంతోనే తమను సమావేశానికి ఆహ్వానించలేదన్నారు. జరిగిందేమిటి? శుక్రవారం జరిగే సమీక్షకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని గురువారం నాటి సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రస్తుతం గుర్తింపు సంఘం అంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు అన్ని సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం వెళ్లాలి. లేదా గత ఎన్నికల ఫలితాల ఆధారంగా గుర్తింపు సంఘం నేతలను ఆహ్వానించాలి. అంటే గత ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ సంయుక్తంగా గుర్తింపు యూనియన్‌గా నిలిచినందున.. ఆ రెండు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలి. కానీ టీఎంయూ నేతలను మాత్రమే ఆహ్వానించడం వివాదానికి కారణమైంది. -
బ్యారేజీ కాదు.. ఆనకట్ట!
తుమ్మిడిహెట్టిపై రాష్ట్ర ప్రభుత్వం యోచన * బ్యారేజీకి రూ.1,800 కోట్ల ఖర్చు.. ఆనకట్టకు రూ.200 కోట్లు * ప్రాణహిత-చేవెళ్లపై అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో స్వల్ప మార్పులు చేయాలని యోచిస్తోంది. బ్యారేజీ కి బదులు ఆనకట్ట నిర్మించే దిశగా ఆలోచనలు చేస్తోంది. వ్యయం తగ్గించడంతోపాటు మహారాష్ట్ర నుంచి ముంపు వివాదం లేకుండా ఉండేందుకే ఆనకట్ట నిర్మాణం వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. 6 టీఎంసీలకు అంత ఖర్చు అక్కర్లేదు.. 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఉంటుందని, అక్కడ్నుంచి నీటిని మళ్లించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని చెబుతోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు కుదించి నీటిని నిల్వ చేయాలని భావించింది. అయితే ఇందుకు సుమారు రూ.1,800 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం ఉంది. కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇంతస్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బ్యారేజీ బదులు ఆనకట్ట కట్టాలని యోచిస్తోంది. 2 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే ఎత్తులో కేవలం రూ.200 కోట్ల ఖర్చుతో దీన్ని చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని... అవసరాన్ని బట్టి 80 నుంచి 120 రోజుల పాటు 15 టీఎంసీల వరకు మళ్లించుకోవచ్చని, దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 1.50 లక్షల ఎకరాలకు నీరందించవచ్చన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణం ఏ ఎత్తులో చేపట్టినా ముంపుపై మహారాష్ట్రకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి బదులు ఆనకట్ట వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఒకట్రెండు టీఎంసీలు ఉంటే దాన్ని ఆనకట్టగా, 2 నుంచి 8 టీఎంసీల వరకు ఉంటే బ్యారేజీగా పరిగణిస్తారు. లైడార్ సర్వేకు ఓకే కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సర్వే చేసేందుకు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు అనుమతినిచ్చాయి. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ప్రాజెక్టుల డిజైన్‌లో మార్పుచేర్పుల్లో భాగంగా మరో రెండు రిజార్వయర్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్, గంధమల రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గంధమల రిజర్వాయర్‌ను 0.5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 0.8 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం, ఎల్లంపల్లి అలైన్మెంట్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లుగా సమాచారం. -
వాన జల్లు... వరద పొంగు
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు సాక్షి, విజయవాడ బ్యూరో/విశాఖపట్నం: /హైదరాబాద్: రాష్ట్రాన్ని మొన్నటి వరకు ఎండలు ముచ్చెమటలు పట్టిస్తే.. ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా కోస్తా తీరంలోని జిల్లాలో మూడు రోజులుగా పడుతున్న వానల కారణంగా నారుమళ్లు నీట మునిగాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. పుష్కర పనులకు, పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పనులకు విఘాతం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో నారుమళ్లు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఈ నెల 16వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 50 మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా దొరకలేదు. రెండు ఆర్మీ హెలికాప్టర్, రిలయన్స్‌కు చెందిన హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వద్ద పశువుల కాపరి ఏసునాథ్ మున్నేరువాగులో చిక్కుకోవడంతో గజ ఈతగాళ్లు అతన్ని రక్షించారు. * తూర్పుగోదావరి జిల్లా చింతూరు-మారేడుపల్లి ఘాట్ రోడ్డులో దుర్గగుడి, టైగర్ క్యాంపుల నడుమ కొండచరియలతోపాటు భారీ వృక్షాలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విశాఖ ఏజెన్సీలోని దాదాపు 96 గ్రామాల ప్రజల జలబంధనంలో చిక్కుకున్నారు. వర్షాలపై సీఎం సమీక్ష వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో సమస్య ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కోస్తాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
పల్లెపల్లెలో ఉచిత వైఫై
- మూడేళ్లలో పనులు పూర్తి - ఫైబర్‌గ్రిడ్‌పై సమీక్షలో సీఎం - విస్తరణ పూర్తయితే రూ. 150 కే నెట్ కనెక్షన్ హైదరాబాద్: మూడేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన నిధుల సేకరణపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. 2018కల్లాఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పనుల్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకోసం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీనిపై ఎలాంటి పన్నులు విధించొద్దంటూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయా పనుల్ని జిల్లా కలెక్టర్లే పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ 10 నుంచి 20 ఎంబీపీఎస్, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఒకటి నుంచి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ఐటీ సలహాదారు సత్యనారాయణ ఫైబర్‌గ్రిడ్‌పై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని, విద్య, వైద్యశాలల సహా 46 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఉచిత కనెక్టివిటీ ఇవ్వాలనేది ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఆ తర్వాత వీటిని జిల్లా, మండల, పంచాయతీ స్థాయికి విస్తరిస్తామన్నారు. విస్తరణ పనులు పూర్తయితే కేవలం రూ. 150కే నెట్ కనెక్షన్ పొందవచ్చన్నారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎంవో సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాంగం.. నిర్లక్ష్యం..
‘అధికారులు అలక్ష్యం వద్దు.. యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రెండు నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అందరూ సన్నద్ధంగా ఉండాలి’ - సోమవారం సమీక్షలో కేసీఆర్ ⇒ సీఎం సమీక్షలో వెల్లడైన అధికారుల అలక్ష్యం ⇒ వరంగల్ ఆర్అండ్బీ ఈఈ జనార్దన్‌రెడ్డి సరెండర్ ⇒ సీఎం ఫోన్ చేసినా స్పందించని ఈఈ ⇒ ఉత్సవాల తేదీల ఖరారుపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరిపాలన, అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఈఈ జనార్దన్‌రెడ్డిపై వేటు పడింది. ఈఈ జనార్దన్‌రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ ఈఈ చిన్నపుల్లదాస్కు వరంగల్ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిపాలన అంశాల విషయంలో జిల్లా యంత్రాంగం తీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో జిల్లా అభివృద్ధి విషయంలో అధికారుల వైఖరి కేసీఆర్‌ను అసహనికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా తాను ఫోన్ చేసి చెప్పినా అంశాలను పట్టించుకోకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ సహా పలువురు శాఖల అధికారుల పనితీరు, సమావేశంలో ఇచ్చే వివరణపై అసంతృప్తి దాచుకోలేకపోయారు. అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష కోసం సోమవారం జిల్లాకు వచ్చిన కేసీఆర్.. ప్రధానంగా టెక్స్టైల్ పార్క్, రోడ్ల నిర్మాణం, కాకతీయ ఉత్సవాలపై సమీక్షించారు. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారుల విషయంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇటీవల కేసీఆర్ నేరుగా వరంగల్ డివిజన్ రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. స్వయంగా సీఎం ఫోన్ చేసి చెప్పినా జనార్దన్‌రెడ్డి పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరును ప్రశ్నించారు. అందరూ ఏమి తెలియదని చెప్పినట్లుగా ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈఈ జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ఈ శాఖ ఎస్ఈ మోహన్‌నాయక్ సర్ది చేప్పేందుకు ప్రయత్నించారు. ఎస్ఈ తీరుపైనా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈఈ జనార్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సూచించారు. అటవీ శాఖపై.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం అవసరమైన భూముల స్థలాల సమాచారంపైనా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పార్క్ కోసం కనీసం వెయ్యి ఎకరాలు తగ్గకుండా స్థలాలు కావాలని సూచించినా.. జిల్లా అధికారులు 500 లోపు ఎకరాలు ఉన్న స్థలాలనే ప్రతిపాదనల్లో పెట్టారు. ఈ కారణంతోనే కేసీఆర్ ఏరియల్సర్వే షెడ్యూల్ మారింది. నగరానికి సమీపంలో ఒకే చోట 2 వేల ఎకరాల వరకు ఉన్న స్థలాలను సూచించాలని సమీక్షలో అటవీ అధికారులను ఆదేశించారు. నగరానికి 20 కి.మీ పరిధిలో, 30 కి.మీ పరి ధిలోని అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ ముఖ్య అధికారి రాజారావు ఇవ్వలేకపోయారు. గంటలోపు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇలా చెప్పిన 45 నిమిషాల తర్వాత అటవీ శాఖ అధికారులకు సీఎం గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. కాకతీయ ఉత్సవాలపైనా.. కాకతీయ ఉత్సవాల నిర్వహణ తేదీలను కలెక్టర్ జి.కిషన్ ప్రకటించడంపైనా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. తేదీలను ఎలా ప్రకటిస్తారని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ.ఆచార్య మొదట కలెక్టర్ జి.కిషన్‌ను ప్రశ్నిం చారు. ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించకుం టే ఎలా అని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సమీక్ష సమావేశానికి సంధించిన సమాచారాన్ని పొందుపరిచిన పుస్తకాలను సమావేశంలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న స్పీకర్, మంత్రులకే ఇవ్వడంపై రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మనది పారదర్శక ప్రభుత్వమని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమీక్ష వివరాలు అందరికీ ఇవ్వకపోతే ఎలా అని కలెక్టర్ జి.కిషన్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సమాచార పుస్తకం నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నారు. మొత్తంగా ప్రధాన అంశాలపై అధికారుల తీరు సరిగా లేకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2 నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అప్పుడు అందరం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి’ అని కేసీఆర్ చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ తీరుతో జిల్లా యంత్రాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు చులకన భావం ఏర్పడిందని జిల్లా ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు.