భారత్ పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
ముంబయి : భారత్ పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ముంబయిలో 102వ భారత సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ, మానవాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉందన్నారు.
మన శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలోనే మంగళయాన్ను కక్ష్యలో ప్రవేశపెట్టారని ఆయన ప్రశంసించారు. మంగళయాన్ మన శాస్త్రవేత్తల జ్ఞానానికి నిదర్శనమన్నారు. శాస్త్ర, సాంకేతికతతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. వ్యర్థాలను డబ్బు ఉత్పత్తి కేంద్రాలుగా మలచాలని మోదీ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉందని ఆయన ఉద్ఘాటించారు. చైనాలో అభివృద్ధి, శాస్త్ర సాంకేతికత సమానస్థాయిలో అభివృద్ధి చెందాయని మోదీ పేర్కొన్నారు.