'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం'
Published Tue, Oct 18 2016 4:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
-జనవరిలో 3 నుంచి 7 వరకు
,
న్యూఢిల్లీ: తిరుపతిలో జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవవనరుల అభివృధ్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై వారు ఉన్నతాధికారులతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అనే ప్రధాన అంశంతో సదస్సు జరుగుతుందని చెప్పారు. ఏపీలోని విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 9 మందికి పైగా నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని మంత్రి గంటా తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement