
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మణిపూర్‌కు తరలిపోయాయి. ఫిబ్రవరి నెలలో మణిపూర్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగాల్సి ఉంది. వచ్చే నెల 3 నుంచి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు నిర్వహించలేమంటూ ఓయూ చేతులెత్తేసింది. ఓయూలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, భద్రతా కారణాల రిత్యా ఈ సమావేశాలు నిర్వహించలేమని పేర్కొంది. దీంతో ఓయూలో జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మణిపూర్‌కు తరలిపోయాయి.
హైదరాబాద్ నగరంలో ఇటీవల అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును, తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలందుకుంది. అంతేకాకుండా ఓయూలో ఇటీవల వందేళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఓయూలో ఘనంగా నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా సమావేశాలు నిర్వహించలేమంటూ ఓయూ చేతులు ఎత్తేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment