త్రిష
త్రిషాకు చేపలంటే ఇష్టం. గుండెల నిండా ప్రేమను నింపుకున్నారు. అంతెందుకు ‘నీమో ఫిష్’ ట్యాటూని వేసుకున్నారు. త్రిష లో నెక్ డ్రెస్ వేసుకున్నప్పుడు పరీక్షగా చూస్తే మీకే అర్థం అవుతుంది ఆ ట్యాటూ ఎక్కడ ఉందో. ఇప్పుడీ చేప గోల ఏంటీ? అంటే.. వరుసగా షూటింగ్స్ బిజీ నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న హాలీడే బ్రేక్ తీసుకున్నారు త్రిష. దాంట్లో భాగంగా దుబాయ్ వెళ్లారామె. అక్కడ ఎంచక్కా డాల్ఫిన్స్‌తో ఆడుకునే వీలు కుదిరింది. అంతే.. డాల్ఫిన్స్‌ను ముద్దాడుతూ, హగ్గాడుతూ కాలక్షేపం చేశారామె. అంతేనా.. తన అభిమానుల కోసం ఆ ఫొటోలను ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటూ షేర్ చేశారు. ఫొటోలను చూసి డాల్ఫిన్ అయినా కాకపోతిని అని కుర్రకారు అనుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment