బరంపురం: చిలికా ఉప్పునీటి సరస్సులో డాల్ఫిన్లు క్రమంగా అంతరిస్తున్నట్లు తెలుస్తోంది. అసియాలోనే అతి పెద్దదైన ఈ సరస్సులో ఉన్న డాల్ఫిన్లను ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది లెక్కించారు. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 113 ఉన్నట్లు నిర్ధారించారు. గతేడాది వీటి సంఖ్య 154 ఉండగా, ఈ ఏడాది 113కు తగ్గింది. సరస్సులోని బిత్తరకొనికా, సతపడా, కృష్ణప్రసాద్, నూవపడా, బోయికులా, బల్లగాం, టాంగి మరియు బల్లుగాం రేంజ్‌ల పరిధుల్లో 10 అటవీ బృందాలు వీటిని లెక్కించాయి.
లెక్కింపులో అటవీ, పర్యావరణ, చిలికా అభివృద్ధి సంస్థ, వన్యప్రాణుల సంరక్షణ విభాగాల అధికారులు పాల్గొన్నట్లు చిలికా డివిజినల్ ఫారస్ట్ అఫీసర్ బి.ఆర్.దాస్ తెలియజేశారు. అయితే ప్రతి ఏడాదీ వీటి సంఖ్య క్రమేపీ తగ్గుతుండడంతో పర్యావరణ ప్రేమికులు, సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరస్సులో మోటార్ బోట్లు సంచరించడం కారణంగానే డాల్ఫిన్లు అంతరిస్తున్నట్లు వన్యప్రాణుల సంరక్షణ విభాగం పరిశోధనలో తేలినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment