
చెన్నై: ఆర్ముగనేరి సమీపంలోని పున్నకాయలో 40 పైగా డాల్ఫిన్లు ఒడ్డుకు చేరటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తూత్తుకుడి జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న పున్నకాయల్ సముద్రతీర జాలర్ల గ్రామం ఉంది. తామరభరణి నది సంగమించే ఈ ప్రాంతంలో సముద్రతీరం నుంచి సముద్రానికి పడవలు సులభంగా వెళ్లే రీతిలో రెండు వేలాడే వంతెనలను (పడవలు వెళ్లేటప్పుడు తెరచుకుంటాయి) నిర్మించారు. సోమవారం రాత్రి ఈ వంతెనల సమీపంలో సుమారు 40 డాల్ఫిన్లు ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలకు పోరాడుతున్నాయి. వెంటనే ఆ ప్రాంతపు జాలర్లు నాటుపడవల్లో వెళ్లి ఆ డాల్ఫిన్లను చేతులతో పట్టుకుని తాడుతో కట్టి సముద్రంలోకి లాక్కుని వెళ్లి లోతైన ప్రాంతంలో వదిలారు.
అయితే అవి మళ్లీ ఒడ్డుకు వచ్చాయి. కొద్ది సేపట్లో నాలుగు డాల్ఫిన్లు మృతి చెందాయి. అప్పుడు వర్షం పడుతుంది. అయినా కాని వర్షాన్ని లెక్క చేయకుండా ఒడ్డుకు చేరుకున్న డాల్ఫిన్లను జాలర్లు సముద్రానికి తీసుకుని వెళ్లి వదిలే పనిలో నిమగ్నలయ్యారు. సముద్రంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా డాల్ఫిన్లు లోతు తక్కువ గల సముద్రతీర ప్రాంతంలో ఒడ్డు చేరి ఉండవచ్చునని భావిస్తున్నారు. గత ఏడాది జనవరి నెలలో కూడా ఇదే విధంగా పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు ఒడ్డుకు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment