ఉక్రెయిన్‌పై యుద్ధం: భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం | Russia Ukraine Crisis News Live Updates Telugu Day 6 | Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

Published Tue, Mar 1 2022 7:31 AM | Last Updated on Tue, Mar 1 2022 9:34 PM

Russia Ukraine Crisis News Live Updates Telugu Day 6 - Sakshi

Live Updates:

►మరో సారి రష్యా ఉక్రెయిన్‌ మధ్య చర్చలు.. 
రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండవ రౌండ్ చర్చలు మార్చి 2 న జరగనున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కడ జరగనున్నాయి, దీనికి ఎవరు హాజరుకానున్నారన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


►భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

   ఉక్రెయిన్‌లో ఖార్కివ్‌ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందడంతో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత రెండు           రోజుల్లో ప్రధాని ఇలా నిర్వహించడం ఇది నాలుగోసారి.

ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని పరిస్థితులతో పాటు భారత విద్యార్థులను త్వరగతిన స్వదేశానికి రప్పించే ప్రక్రియ మరింత     వేగవంతం చేసే చర్యలు గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 


660,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందేందుకు ఉక్రెయిన్‌ నుంచి  వెళ్లిపోయారని యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది.

►మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడిని కొనసాగుతుంది:  రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ

రష్యా తన లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దాదాపు వారం రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది.

►2022 వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా రష్యాపై నిషేధం
2022లో వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు రష్యా అతిధ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రష్యా అతిధ్యాన్ని నిషేదిస్తున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి       వాలీబాల్ ప్రకటించింది.

ఉక్రెయిన్  నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు ఏపీ విద్యార్థులు 
విమానాశ్రయం నుంచి నేరుగా వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు

►ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి
     ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు కాల్పుల్లో విద్యార్థి మృతి
     కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా గుర్తింపు


 

► ఖార్కివ్‌, చెర్నిహివ్‌(ఉక్రెయిన్‌)పై రష్యా బలగాల దాడులు. ఒకిట్రికా ఎయిర్‌బేస్‌పై దాడిలో 70మంది దుర్మరణం.

భారతీయ విద్యార్థుల బృందం ఒకటి పోల్యాండ్‌లోకి ప్రవేశించింది. 

వాయుసేనను రంగంలోకి దించిన కేంద్ర ప్రభుత్వం.. భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని చూస్తోంది.

కీవ్‌లోని భారతీయులు అర్జెంట్‌గా నగరం వీడాలని భారత ఎంబసీ కీలక సూచన చేసింది. 

రష్యా బలగాలు కీవ్‌ నగరంవైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందా? అనే టెన్షన్‌ నెలకొంది.

 ఓఖ్టిర్కా (ఉక్రెయిన్) సైనిక స్థావరంపై రష్యా ఫిరంగిదళం దాడి చేయడంతో 70 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు సమాచారం.

► రష్యాకు అమెరికా ఊహించని దెబ్బ: ఆంక్షల మీద ఆంక్షలతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా.. రష్యాకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్య మిషన్‌లోని 12 మంది సభ్యులను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని  ఐక్యరాజ్యసమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా విలేకరుల సమావేశంలో తెలిపారు. అమెరికా చేష్టల్ని ఖండిస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన.


► కీవ్‌ నుంచి 64 కిలోమీటర్ల మేర రష్యన్‌ దళాల మోహరింపు. శాటిలైట్‌ చిత్రాలు వైరల్‌.  

► ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్‌లోని అనేక నివాస ప్రాంతాలపై రష్యన్ ఫిరంగిదళం దాడి చేసింది. ఖార్కివ్‌లో జరుగుతున్న షెల్లింగ్‌లో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు సమాచారం.

► ఉక్రెయిన్‌ సంక్షోభం.. ఆపరేషన్‌ గంగలో భాగంగా ముంబైకి చేరిన ఏడో విమానం. సురక్షితంగా 182 మంది స్వదేశానికి రాక. 

► ఆరవ రోజు యుద్ధంలో భాగంగా.. జనావాస ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. దాడుల్లో 350 మంది పౌరులు మరణించినట్లు చెబుతోంది. 


చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ .. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుండటంతో ఆరో రోజు రష్యా దళాలు ముందుకు సాగలేకపోతున్నాయి. అయితే కీలక పట్టణాలను మాత్రం సమర్థవంతంగా చుట్టుముట్టగలిగాయి రష్యా బలగాలు. ఈ క్రమంలో..  


► రష్యా తమపై వాక్యూమ్‌ బాంబ్‌ ప్రయోగించినట్లు ఆరోపిస్తోంది  ఉక్రెయిన్‌. ఈ మేరకు అమెరికాలో ఉక్రెయిన్‌ రాయబారి ఒక్సానా మరకరోవా సోమవారం అమెరికా కాంగ్రెస్‌(చట్ట సభ)లో ప్రకటించారు. జెనీవా కన్‌వెక్షన్‌ నిషేధించిన వాక్యూమ్‌ బాంబ్‌ను దురాక్రమణలో భాగంగా రష్యా మాపై(ఉక్రెయిన్‌) ప్రయోగించింది అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం చేయాలనుకుంటోంది అని ఆమె ఆరోపించారు. 

వాక్యూమ్ బాంబు అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రత పేలుడును ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల గాలి నుండి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. లక్క్ష్యం తునాతునకలు అయిపోతుంది. ఇదిలా ఉండగా.. రష్యా వాక్యూమ్‌ బాంబ్‌ను ప్రకటించినట్లు ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నాం ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలో థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్‌ను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement