Prohibited list
-
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
వీడిన ‘షరతుల’ చెర
భూమి(తల) రాత మార్పు నాలుగైదు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆ భూమి ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా మారిపోయింది. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కష్టపడి అలాంటి భూమిని కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అన్యాయమైపోయారు. ఆ భూమిలో పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న రైతులు ఒక్కసారిగా కుదేలైపోయారు. తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఈ సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది. బ్రిటీష్ కాలం నుంచి రైతుల చేతుల్లో ఉండి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని.. ఆ జాబితా నుంచి వాటిని తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17,730 సర్వే నంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేసింది. మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. కోడూరు మండలంలో 9,600 ఎకరాలను తొలగించారు. బొల్లికొండ ఫణికుమార్ – సాక్షి, అమరావతి: ఆర్‌ఎస్‌ఆర్‌లో షరతులు గల పట్టా అని ఉన్న 33 వేల ఎకరాల భూములను 2016లో తెలుగుదేశం ప్రభుత్వం 22ఏ (1)ఇ జాబితాలో చేర్చడంతో రైతులు కుదేలయ్యారు. 1910లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ భూములను రైతులకు వేలం ద్వారా ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ భావిస్తోంది. వేలం కాదు రైతులకు అసైన్డ్ చేసిందనే వాదన కూడా ఉంది. ఏదైనా వందేళ్లకు ముందు నుంచే ఆ భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. వారికి పట్టాలుండటంతోపాటు,ఆర్‌ఎస్‌ఆర్‌లో వారి పేర్లు నమోదయ్యాయి. అప్పటి నుంచి శిస్తు కడుతూనే ఉన్నారు. అవసరానికి వాటిని అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. బ్రిటీష్ హయాం నుంచి లావాదేవీలున్న ఆ భూములను 2016 మే 5న జీఓ ఎంఎస్ నెంబర్ 196 ద్వారా టీడీపీ ప్రభుత్వం 22ఏ(1)ఇ కేటగిరీలో పెట్టేసింది. అప్పటి వరకు సర్వ హక్కులతో ఏళ్ల తరబడి ఆ భూములను అనుభవించిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు కూడా ఆగిపోయాయి. అప్పటికే బేరం కుదుర్చుకున్న వారు కొనడానికి ముందుకు రాలేదు. కొందరైతే కొంత డబ్బు తీసుకుని భూమిని వదులుకున్నారు. తమ కూతుళ్లకు ఆ భూమిని ఇచ్చిన తండ్రులు కొందరు అల్లుళ్లకు సమాధానం చెప్పలేక నానా బాధలు పడ్డారు. గత ప్రభుత్వం ఆ భూములపై పంట నష్టం కూడా ఇవ్వలేదు. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అనేక మంది చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ధర్నాలు చేసినా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. దీంతో వేలాది రైతు కుటుంబాలకు తీరని కష్టంగా మారింది. జగన్ రాకతో మంచి రోజులు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారిలో ఆశలు చిగురించాయి. తమ సమస్యను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నారు. అప్పటికే ఈ సమస్యపై పోరాడిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ షరతులు గల పట్టా భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధ్యయనం చేసింది. వందేళ్ల నుంచి రైతులు అనుభవిస్తున్న భూములను 22ఏ కేటగిరీలో చేర్చడం తప్పని నిర్ధారించింది. ఒకవేళ ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందనుకున్నా.. 1954కు ముందే అది జరిగింది కాబట్టి నిరభ్యంతరంగా వాటిపై రైతులకు హక్కులు ఉంటాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ల చట్టం 1908 22ఏ(1)ఇ కేటగిరీ నుంచి తొలగిస్తూ 2022 అక్టోబర్ 7న జీఓ ఎంఎస్ నంబర్ 667ను జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 20న అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఈ షరతుల బారిన పడిన ఏ రైతును కదిలించినా జగన్ ప్రభుత్వం తమకు చేసిన మేలు మరచిపోలేమని భావోద్వేగంతో చెబుతున్నారు. నా జీవితాన్ని నిలబెట్టారు.. షరతులు గల పట్టా పేరుతో నా లాంటి వేల మంది రైతుల జీవితాలను గత ప్రభుత్వం తలకిందులు చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మళ్లీ జీవితాలు ఇచ్చారు. నాకు 7.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత అల్లపర్తి రామబ్రహ్మం నుంచి మా నాన్న రాధాకృష్ణకు, ఆయన నుంచి నాకు ఆ భూమి వచ్చింది. 1920 నుంచి ఆ భూమిని మా కుటుంబం సాగు చేసుకుంటోంది. అప్పటి నుంచి శిస్తు కట్టాం. అవసరమైనప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టాం. ఏటా పంట రుణాలు తీసుకున్నాం. మూడు తరాల నుంచి మాకున్న భూమిని 2016లో ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. బ్యాంకు రుణం కోసం వెళితే ప్రభుత్వ భూమి కాబట్టి ఇవ్వమన్నారు. పంట దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. తనఖా పెట్టడానికి, అమ్ముకోవడానికి అవకాశం లేదు. భూమి చేతిలోనే ఉంది.. కానీ ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు ఉన్న భూమిలో కొంత ఆమెకు ఇచ్చా. అది విలువ లేనిదంటూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంత మంది చుట్టూ తిరిగామో లెక్కలేదు. మేం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఆపద్భాందవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు సర్వ హక్కులూ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. – అల్లపర్తి హరి మోహనరావు, భావదేవరపల్లి, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా మా పొలం మాకు దక్కింది కోడూరు మండలం మాచవరంలో సర్వే నంబర్ 446/ఏలో నాకు 83 సెంట్ల పొలం ఉంది. 2006లో బడే వాసుదేవరావు నుంచి కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఏడాది క్రితం నా భర్తకు గుండె సమస్య రావడంతో బైపాస్ చేయాలని చెప్పారు. రూ.6 లక్షలు అవసరమవడంతో పొలం అమ్ముదామని బేరం పెడితే ఇది రిజిస్ట్రేషన్‌కు పనికిరాదన్నారు. కో ఆపరేటివ్ సొసైటీ రుణం కోసం వెళ్లినా ఇవ్వలేదు. పంట నష్టం కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పొలాన్ని మాకు దక్కేలా చేశారు. షరతులు గల పట్టా నుంచి తీసి దానిపై మాకు పూర్తి హక్కు కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం మేలు మరచిపోము. – సనకా గోవర్ధన, వి.కొత్తపాలెం, కోడూరు మండలం పనికి రాదన్న భూమికి విలువ వచ్చింది నా తండ్రి సనకా కృష్ణమూర్తి నాకు 2.20 ఎకరాలు ఇచ్చారు. 2003లోనే దాన్ని నా పేరుతో రిజిష్టర్ చేసి అప్పగించారు. అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ అన్ని హక్కులతో ఉపయోగించుకున్నాం. 2018లో పెద్ద రుణం (ఎల్టీ లోన్) కోసం బ్యాంకుకు వెళితే ఈ భూమి 22ఏ జాబితాలో ఉందని, రాదని చెప్పారు. చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. జగన్ ప్రభుత్వానికి ఎంతో రుణ పడి ఉంటాం. పనికిరాదన్న మా భూమికి తిరిగి విలువ కల్పించారు. – రేపల్లె నాగరాజ, వి.కొత్తపాలెం, కోడూరు మండలం ఎంతో సంతోషంగా ఉన్నాం 2001లో మా గ్రామంలోని సర్వే నంబర్ 226/1, 228/1లో 3.31 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 2017 తర్వాత అందులో ఒక ఎకరం మా అబ్బాయి పేరు మీద మార్చాలని వెళితే ఇది 22–ఏ జాబితాలో ఉన్నందున కుదరదన్నారు. చాలా మంది చుట్టూ తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అన్నం పెట్టే భూమిని ఇలా చేశారేంటని చాలా బాధ పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. అమ్ముకోవడానికి, నా కొడుకు పేర రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సంతోషంగా ఉంది. – చిట్టిప్రోలు రామ్మోహనరావు, లింగారెడ్డిపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా -
ఉక్రెయిన్‌పై యుద్ధం: భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
Live Updates: ►మరో సారి రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండవ రౌండ్ చర్చలు మార్చి 2 న జరగనున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కడ జరగనున్నాయి, దీనికి ఎవరు హాజరుకానున్నారన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ►భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఉక్రెయిన్‌లో ఖార్కివ్ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందడంతో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత రెండు రోజుల్లో ప్రధాని ఇలా నిర్వహించడం ఇది నాలుగోసారి. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని పరిస్థితులతో పాటు భారత విద్యార్థులను త్వరగతిన స్వదేశానికి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం చేసే చర్యలు గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ► 660,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందేందుకు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయారని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది. ►మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడిని కొనసాగుతుంది: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా తన లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దాదాపు వారం రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. ►2022 వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా రష్యాపై నిషేధం 2022లో వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు రష్యా అతిధ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రష్యా అతిధ్యాన్ని నిషేదిస్తున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ ప్రకటించింది. ►ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు ఏపీ విద్యార్థులు విమానాశ్రయం నుంచి నేరుగా వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు ►ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి ఖార్కీవ్లో రష్యన్ బలగాలు కాల్పుల్లో విద్యార్థి మృతి కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా గుర్తింపు With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family. We convey our deepest condolences to the family. — Arindam Bagchi (@MEAIndia) March 1, 2022 ► ఖార్కివ్, చెర్నిహివ్(ఉక్రెయిన్)పై రష్యా బలగాల దాడులు. ఒకిట్రికా ఎయిర్‌బేస్‌పై దాడిలో 70మంది దుర్మరణం. ► భారతీయ విద్యార్థుల బృందం ఒకటి పోల్యాండ్‌లోకి ప్రవేశించింది. A group of Indian students stranded in Ukraine has entered Poland, to undertake the onward journey to India pic.twitter.com/Rm3YvumzoC — ANI (@ANI) March 1, 2022 ► వాయుసేనను రంగంలోకి దించిన కేంద్ర ప్రభుత్వం.. భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని చూస్తోంది. ► కీవ్‌లోని భారతీయులు అర్జెంట్‌గా నగరం వీడాలని భారత ఎంబసీ కీలక సూచన చేసింది. ► రష్యా బలగాలు కీవ్ నగరంవైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. ► ఓఖ్టిర్కా (ఉక్రెయిన్) సైనిక స్థావరంపై రష్యా ఫిరంగిదళం దాడి చేయడంతో 70 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ► రష్యాకు అమెరికా ఊహించని దెబ్బ: ఆంక్షల మీద ఆంక్షలతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా.. రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్య మిషన్‌లోని 12 మంది సభ్యులను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా విలేకరుల సమావేశంలో తెలిపారు. అమెరికా చేష్టల్ని ఖండిస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. #WATCH 12 members of Russia's diplomatic mission to the UN have been expelled by the United States, said Russia's Permanent Representative to the United Nations Vassily Nebenzia during a press conference (Source: UN Web TV) pic.twitter.com/0JVT66C3nu — ANI (@ANI) March 1, 2022 ► కీవ్ నుంచి 64 కిలోమీటర్ల మేర రష్యన్ దళాల మోహరింపు. శాటిలైట్ చిత్రాలు వైరల్. ► ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్‌లోని అనేక నివాస ప్రాంతాలపై రష్యన్ ఫిరంగిదళం దాడి చేసింది. ఖార్కివ్‌లో జరుగుతున్న షెల్లింగ్‌లో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. ► ఉక్రెయిన్ సంక్షోభం.. ఆపరేషన్ గంగలో భాగంగా ముంబైకి చేరిన ఏడో విమానం. సురక్షితంగా 182 మంది స్వదేశానికి రాక. ► ఆరవ రోజు యుద్ధంలో భాగంగా.. జనావాస ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దాడుల్లో 350 మంది పౌరులు మరణించినట్లు చెబుతోంది. చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ .. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుండటంతో ఆరో రోజు రష్యా దళాలు ముందుకు సాగలేకపోతున్నాయి. అయితే కీలక పట్టణాలను మాత్రం సమర్థవంతంగా చుట్టుముట్టగలిగాయి రష్యా బలగాలు. ఈ క్రమంలో.. ► రష్యా తమపై వాక్యూమ్ బాంబ్ ప్రయోగించినట్లు ఆరోపిస్తోంది ఉక్రెయిన్. ఈ మేరకు అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకరోవా సోమవారం అమెరికా కాంగ్రెస్(చట్ట సభ)లో ప్రకటించారు. జెనీవా కన్వెక్షన్ నిషేధించిన వాక్యూమ్ బాంబ్‌ను దురాక్రమణలో భాగంగా రష్యా మాపై(ఉక్రెయిన్) ప్రయోగించింది అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం చేయాలనుకుంటోంది అని ఆమె ఆరోపించారు. వాక్యూమ్ బాంబు అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రత పేలుడును ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల గాలి నుండి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. లక్క్ష్యం తునాతునకలు అయిపోతుంది. ఇదిలా ఉండగా.. రష్యా వాక్యూమ్ బాంబ్‌ను ప్రకటించినట్లు ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నాం ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్‌ను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకటించింది. -
80 ఔషధాలపై నిషేధం
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మరో 80 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) ఔషధాల్ని నిషేధించింది. ఇందులో నొప్పి నివారిణులు, యాంటిబయోటిక్‌లతో పాటు బీపీ, బ్యాక్టీరియా, ఫంగస్‌లతో వ్యాపించే వ్యాధుల చికిత్సకు వాడే మందులున్నాయి. ఈ ఔషధాలపై నిషేధం జనవరి 11నే అమల్లోకి వచ్చిందని తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. దీంతో నిషేధానికి గురైన మొత్తం ఎఫ్డీసీ ఔషధాల సంఖ్య 405కు పెరిగింది. సెప్టెంబర్‌లో 325 ఔషధాలను నిషేధిత జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీలో రెండు, అంతకంటే ఎక్కువ ఔషధాలు స్థిర నిష్పత్తిలో ఒకే డోస్‌గా ఉంటాయి. తాజాగా నిషేధించిన ఔషధాల జాబితాలో యాంటిబయోటిక్‌లు సెఫ్గ్లోబ్ ఓజెడ్, టాక్సిమ్ ఓజెడ్, బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఓర్ఫ్లాజ్ కిట్, వెజినోబాక్ట్, హైపర్‌టెన్షన్ ఔషధాలైన టెలిప్రిల్ హెచ్, లోరమ్ హెచ్, యాంటీ యాంగ్జెటి డ్రగ్ రెస్టా తదితరాలున్నాయి. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇవి నిషేధితమా..!
నెల్లూరు(సెంట్రల్): అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కొన్నైతే, అన్ని పత్రాలతో కొనుగోలు చేసినవి మరికొన్ని, ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ఉన్న పలంగా ప్రభుత్వం మాత్రం ఆ సర్వేనంబర్లు నిషేధిత జాబితాలో చేర్చి ఆయా ప్రాంతాల ప్రజలను ఆందోళనలోకి నెట్టేశాయి. అవసరాలకు ఆ స్థలాలను క్రయవిక్రయాలు చేసుకుందామంటే రిజిస్ట్రేషన్ అధికారులు ససేమిరా అనే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే తీరుతో జాబితాను పంపగా, తిరిగి ఈ ఏడాది మూడు రోజుల క్రితం అదే విధంగా తప్పుల తడకులుగా జాబితాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపడం గమనార్హం. నిషేధిత జాబితాలో పలు సర్వేనంబర్లు జిల్లాలోని నిషేధిత భూముల, స్థలాల సర్వేనంబర్లతో కూడిన జాబితాను జిల్లాలోని అన్ని సబ్రిజిస్ట్రార్లకు రెవెన్యూ అధికారులు ప్రతి ఏడాది పంపుతారు. అదే విధంగా ఈ ఏడాది మూడు రోజుల కిత్రం కొత్త నిషేధిత సర్వేనంబర్ల జాబితాను పంపారు. కాగా ఈ నిషేధిత సర్వేనంబర్లలో నగర నడిబొడ్డున ఉన్న 1934, 35, 2022–ఏ, 2022–బి, 2010 నుంచి 2060 వరకు కొన్ని వందల సర్వేనంబర్లను నిషేధిత జాబితాలో పొందు పరచడం గమనార్హం. అధికారికంగా అన్ని ఉన్నా రెవెన్యూ పొరపాట్ల వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆందోళనలో ప్రజలు జిల్లాలో రిజిస్ట్రేషన్ పరంగా నెల్లూరు, గూడూరు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. వీటిలో నెల్లూరు కింద 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, గూడూరు కింద మరో 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రతి ఏడాది పంపినట్లుగానే ఈ ఏడాది కూడా నిషేధిత సర్వేనంబర్ల జాబితాలను పంపారు. మొత్తం మీద ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో దాదాపుగా 1000 నుంచి 2000 వేల వరకు సర్వేనంబర్లు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేల సంఖ్యలో నిషేధిత సర్వేనంబర్లు ఉన్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందనే విషయం తెలుస్తోంది. వీటిని డాట్ల్యాండ్గా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చడంపైనా సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అలజడి..!
► గ్రేటర్లో 13 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో విచారణ ► బాలానగర్, కూకట్పల్లి కార్యాలయాల్లో భారీ అవకతవకలు ► తేలనున్న అడ్డదారి రిజిస్ట్రేషన్ల లెక్కలు రంగంలోకి విచారణ కమిటీ.. ► పగలనున్న అక్రమాల పుట్ట సాక్షి,సిటీబ్యూరో: అడ్డదారులు, అక్రమ వసూళ్లతో గాడితప్పిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త కలకలం మొదలైంది. నగరంలో నిషేధిత భూములు, తక్కువ విలువతో రిజిస్టర్ అయిన అక్రమాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించనుంది. ఈ అక్రమాల గుట్టు విప్పేందుకు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల రిజిస్ట్రార్లు ట్వింకిల్ జాన్, సుభాషిణిలో రంగంలోకి దిగారు. వాస్తవానికి అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కూకట్పల్లి, బాలానగర్ కార్యాలయాలపై విచారణ చేయాలన్న డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం ఏకంగా జంట జిల్లాల్లోని 13 కార్యాలయాలపై విచారణకు ఆదేశించటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేగుతోంది. కాసులు కురిపిస్తున్న నిషేధిత భూములు ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ (ఏ కార్యాలయం నుంచైనా రిజిస్ట్రేషన్) జంట జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్ తదితర భూములను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దని జిల్లా కలెక్టర్లు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అయినా నగరంలో భారీగా బై నెంబర్లు వేసి ఖరీదైన భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి తోడు నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల విలువను తక్కువగా చూపి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారులుగా నియమితులైన ట్వింకిల్ జాన్, సుభాషిణి నిస్పక్షపాతంగా విచారణ జరిపి, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారా.. లేక, వత్తిళ్లకు లొంగిపోతారా.. అన్న అంశాన్ని ఆశాఖ ఉద్యోగులు, సిబ్బందే ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. త్వరలో పలు మార్పులు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంబంధిత రిజిస్ట్రార్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి, అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చాకే డాక్యుమెంట్ రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అక్రమాల ఆనవాళ్లు ఇవిగో.. ► అత్తాపూర్ ఎంఎం పహాడీ ప్రాంతంలో 355/1,2,3 నంబర్ల అత్యంత విలువైన వక్ఫ్ భూమి వివాదం కోర్టులో ఉండగా ఓ స్థిరాస్తి సంస్థ చేసిన ప్లాట్లను బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ► మియాపూర్ మదీనాగూడ గ్రామ సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను రిజిస్టర్ చేయవద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్ జాబితాను అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. కానీ 100 సర్వే నెంబర్ పక్కన నెంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. ► ఎల్బీనగర్ పరిధిలోని తుర్కయాంజిల్, రామన్నగూడ తదితర ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు సేకరణ పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంచారు. అయినా నాలుగింతల మొత్తాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ► శేరిలింగంపల్లి గోపన్‌పల్లి సర్వే నెంబర్ 124లో 279.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఐటీ కంపెనీలకు కేటాయించిన భూమి మినహా, మిగతా దాన్ని ప్రొహిబిటెడ్ జాబి తాలో చేర్చి రిజిస్ట్రేషన్లు చేయరాదని 2007లోనే నిర్ణయించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ నిర్ణయంతో కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేశారు.