ఐటీ హబ్‌గా విశాఖ | LSUS Group revealed in its study report | Sakshi
Sakshi News home page

ఐటీ హబ్‌గా విశాఖ

Published Mon, Oct 2 2023 5:53 AM | Last Updated on Mon, Oct 2 2023 6:52 PM

LSUS Group revealed in its study report - Sakshi

సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్‌ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్‌ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్‌గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్‌ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్‌ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్‌ ఇంటెలిజెన్స్‌పై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు.

ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు.   

వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. 
ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్‌ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్‌కేర్, ఫార్మా, మెరైన్‌ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement