న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే జీ20 కీలక సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సహకారం, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ‘బ్రిక్స్’ సదస్సు ప్రస్తావనకు వచ్చింది.
సెపె్టంబర్ 9, 10న జరిగే జీ20 సదస్సుకు హాజరయ్యే విషయంలో తన అశక్తతను పుతిన్ తెలియజేశారు. ఈ సదస్సుకు రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. జీ20కి సారథ్యంలో భాగంగా భారత్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు గాను పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment