ఢిల్లీ: జీ20 డిన్నర్ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరవడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం మమత తీసుకున్న నిర్ణయాన్ని ఈ చర్య బలహీనపరుస్తుందని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరవడం వెనక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
'డిన్నర్ మీటింగ్‌కు సీఎం మమతా బెనర్జీ హాజరవకపోతే ఆకాశం విరిగిపడేదా..? డిన్నర్ మీటింగ్‌లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కనే కూర్చున్నారు. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిన్నర్ మీటింగ్‌కు రాలేదు. మల్లిఖార్జున ఖర్గేకు ఆహ్వానమే అందలేదు. ఢిల్లీకి మమతా బెనర్జీ ముందే వెళ్లాల్సిన అవసరం ఏంటి..?' అని అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు.
అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలను టీఎంసీ నేత శాంతను సేన్ తిప్పికొట్టారు. సీఎం మమత ఎక్కడకు వెళ్లాలో కాంగ్రెస్ తమకు పాఠాలు చెప్పకూడదని అన్నారు. ప్రొటోకాల్స్ గురించి తమకు తెలుసని చెప్పారు. ఇండియా కూటమిలో సీఎం మమత పాత్ర ఎంటో తమకు తెలుసని అన్నారు. దీనిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
డిన్నర్ మీటింగ్ శనివారం ఉండగా.. మమతా బెనర్జీ శుక్రవారమే ఢిల్లీ వెళ్లారు. మొదట శనివారమే విమానం షెడ్యూల్ ఖరారు కాగా.. ఢిల్లీలో విమాన రాకపోకలపై నిబంధనల నేపథ్యంలో మమతా బెనర్జీ ఫ్లైట్‌ను శుక్రవారానికి మార్చారు. దీంతో ఆమె శుక్రవారమే ఢిల్లీకి వెళ్లారు. డిన్నర్ మీటింగ్‌కి ముందే వెళ్లాల్సిన అవసమేం వచ్చిందని కాంగ్రెస్ మండిపడుతోంది.
శనివారం జరిగిన జీ20 డిన్నర్ మీటింగ్‌కి హాజరైన వాళ్లలో బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హెమంత్ సొరేన్, మమతా బెనర్జీ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అశోక్ గహ్లోత్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మీటింగ్‌కి హాజరవలేదు.
ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ..
Comments
Please login to add a commentAdd a comment