ఢిల్లీ:దేశం పేరుమార్పుపై ప్రస్తుతం రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీ20 వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై దేశం పేరును భారత్ అనే పేర్కొన్నారు. దీంతో దేశం పేరును మారుస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
జీ20 డిన్నర్ మీటింగ్‌కి ఆహ్వానాలు పంపిన క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన జీ20 బుక్‌లెట్‌లోనూ భారత్, మధర్ ఆఫ్ డెమోక్రసీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే దేశం అధికారిక పేరు భారత్ అని బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు.
రాష్ట్రపతికి పంపిన ఆహ్వాన బుక్‌లెట్‌లో భారత్ అని పేర్కొనడంతో దేశం పేరు మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 18-23 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందున.. దేశం పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టనున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సందించాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇండియా కూటమి మండిపడింది.
ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. ఇండియా కూటమిని దేశ వ్యతిరేకుల కూటమిగా అభివర్ణించింది. ఇండియా పేరు వలసవాద స్వభావాన్ని సూచిస్తోందని, భారత్ పేరు సరైనదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment