జీ20 సమ్మిట్‌: 500 మంది బిజినెస్‌ టైకూన్లతో డిన్నర్‌ | G20 dinner Ambani Adani among 500 businessmen set to attend | Sakshi
Sakshi News home page

జీ20 సమ్మిట్‌: 500 మంది బిజినెస్‌ టైకూన్లతో డిన్నర్‌

Published Wed, Sep 6 2023 7:22 PM | Last Updated on Wed, Sep 6 2023 8:02 PM

G20 dinner Ambani Adani among 500 businessmen set to attend - Sakshi

ప్రతిష్మాత్మక G20 సమ్మిట్  సందర్బంగా నిర్వహిస్తున్న డిన్నర్‌కు  భారత్‌కు చెందిన  బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలను  హాజరు కానున్నారు. ఇందులో ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత  ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ  ప్రముఖంగా ఉన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక జీ-20 శిఖరాగ్ర సమావేశానికి జీ 20  దేశాల లీడర్లతోపాటు  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జీ20 సమ్మిట్‌ విందు ఆహ్వానాలపై శనివారం  జరగనున్న ఈ డిన్నర్‌కు  ఆహ్వానించబడిన  500 మంది వ్యాపారవేత్తలలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా, భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు-చైర్మన్ సునీల్ మిట్టల్ ఉన్నారు.

భారతదేశంలో వాణిజ్యం , పెట్టుబడుల అవకాశాలుహైలైట్‌ కానున్నాయి.  ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నందున, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల జీ 20  దేశాల లీడర్లు ఈ సమ్మిట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది.   దక్షిణాసియా దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన ప్రత్యకతను నిలుపుకోనుంది. 

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా న్యూఢిల్లీలో జరిగే సమావేశంలో భాగస్వామ్యమవుతారని భావిస్తున్నారు. అలాగే ఈ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. సెప్టెంబర్ 9,10వ తేదీల్లో జరిగే గ్రూప్ ఆఫ్ 20 సమావేశాలకు అగ్రదేశాల నేతలతోపాటు వేలాది మంది హాజరుకానున్నారు. వసుధైక కుటుంబం సందేశంతో భారత్ ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మరోవైపు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులుగా  'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ ' పేరిట పంపిన   విందు ఆహ్వానాలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement