450 మంది పోలీసులకు ప్రధాని విందు | PM Modi To Host Dinner For 450 Delhi Police Personnel For This Reason - Sakshi
Sakshi News home page

450 మంది పోలీసులకు ప్రధాని మోదీ విందు, ఎందుకంటే..

Published Wed, Sep 13 2023 7:41 PM | Last Updated on Wed, Sep 13 2023 7:59 PM

PM Modi Dinner Plan With Delhi Police For This reason - Sakshi

ఢిల్లీ: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశం G20 Summit.. సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ వారంలోనే.. అదీ జీ20 సమ్మిట్‌ జరిగిన భారత్‌ మండపంలోనే ఈ విందు కార్యక్రమం ఉండనుందని సమాచారం. 

ఈ మేరకు కానిస్టేబుల్స్‌ నుంచి ఇన్‌స్పెక్టర్ల దాకా.. సదస్సు సమయంలో విధి నిర్వహణ అద్భుతంగా నిర్వహించిన సిబ్బంది జాబితాను ఢిల్లీ కమిషనర్‌ సంజయ్‌ అరోరా సిద్ధం చేస్తున్నారు. వాళ్లతో కలిసి అరోరా, ప్రధాని మోదీ ఇచ్చే డిన్నర్‌లో పాల్గొంటారు.

దాదాపు 40 దేశాల అధినేతలు పాల్గొన్న ఈ కీలక సదస్సును అత్యంత పటిష్టమైన భద్రత నడుమ విజయవంతంగా నిర్వహించింది భారత్‌. హైలెవల్‌ సెక్యూరిటీ నడుమ ఉండే ప్రముఖుల సంరక్షణ అనే అత్యంత కష్టతరమైన బాధ్యతను.. మరీ ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా నిర్వహించడంపై అభినందనలు కురుస్తున్నాయి.    

ప్రధాని మోదీ ఇలా క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని గుర్తించడం కొత్తేం కాదు. గతంలో కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంలో.. నిర్మాణ కూలీలను ఆయన సత్కరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement