న్యూఢిల్లీ: 'భారత్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. వారికి ఇవ్వడానికి భారతీయత ఉట్టిపడే విధంగా రెండు పుస్తకాలను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది.
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు భాగస్వామ్య 20 దేశాలతో పాటు అతిధులుగా మరో తొమ్మిది దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్‌లెట్‌లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి 'భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక' కాగా రెండవది 'భారతదేశంలో ఎన్నికలు'.
ఈ రెండు పుస్తకాల్లోని 40 పేజీల్లో రామాయాణం, మహాభారతంలోని ఇతిహాస ఘట్టాలు, ఛత్రపతి శివాజీ, అక్బర్ వంటి చక్రవర్తుల వీరగాధలతో పాటు సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశంలో అధికార మార్పిడి గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్‌లెట్‌ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది.
మొదటి 26 పేజీల డాక్యుమెంటు భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు.
రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు.
బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు.
ఇది కూడా చదవండి: రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్
Comments
Please login to add a commentAdd a comment