వియత్నాం బయలుదేరిన జో బైడెన్ | G20 Summit US President Joe Biden Departs For Vietnam | Sakshi
Sakshi News home page

G20 Summit:వియత్నాం బయలుదేరిన జో బైడెన్

Published Sun, Sep 10 2023 1:20 PM | Last Updated on Sun, Sep 10 2023 3:18 PM

G20 Summit US President Joe Biden Departs For Vietnam - Sakshi

ఢిల్లీ: శనివారం జీ20 సమావేశాలు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేడు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం నేరుగా ఢిల్లీ విమానశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారత్‌ నుంచి వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి నేరుగా వియత్నాం బయలుదేరారు. అక్కడ ద‍్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. 

భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమావేశానికి బైడెన్ శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. దేశ రాజధానిలోని మౌర్య హోటల్‌లో బస చేశారు. శనివారం ఉదయం నుంచి జరిగిన జీ20 సమావేశాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. 

బైడెన్ భార్య జిల్ బైడెన్‍కు కరోనా సోకిన కారణంగా జీ20 సమావేశాలకు ఆయన హాజరవుతారా..?లేదా..? అనే సందిగ్ధం నెలకొంది. కానీ జో బైడెన్‌కు కరోనా నెగిటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ అగ్రదేశ నేతగా బైడెన్ జీ20 సమావేశాల్లో కీలకంగా పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: బైడెన్ డ్రైవర్‌ను నిర్బంధించిన భద్రతా సిబ్బంది..ఎందుకంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement