ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. | G-20 Summit 2023 Updates: PM Modi Announces Adoption Of G20 Summit Declaration - Sakshi
Sakshi News home page

G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..

Published Sat, Sep 9 2023 5:06 PM | Last Updated on Sat, Sep 9 2023 6:48 PM

New Delhi Declaration Adopted At G20 - Sakshi

ఢిల్లీ:జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్‌ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక కష్టించి పనిచేసిన జీ20షేర్పా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 

ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. అవి..

► బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమగ్ర వృద్ధి

► వేగవంతమైన సుస్థిరాభివృద్ధి

► సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం

► 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు

► బహుపాక్షికతను పునరుద్ధరించడం

జీ20 సదస్సులో అభివృద్ధి, భౌగోళిక-రాజకీయ సమస్యలపై 100 శాతం ఏకాభిప్రాయం కుదిరిందని జీ20 భారత షేర్పా అమితాబ్ కాంత్ అన్నారు. 
'జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఢిల్లీ నాయకుల డిక్లరేషన్‌ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. భారత్ నాయకత్వంలో జీ20 సదస్సు నిర్వహించడం ప్రపంచీకరణకు స్వర్ణ యుగంగా గుర్తింపు పొందింది.' అని అమితాబ్ కాంత్ అన్నారు. 

డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు భౌగోళిక, రాజకీయ అంశాల్లో భూమి, ప్రపంచ శాంతి, ప్రజల శ్రేయస్సుకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ దిశగానే భారత్‌ అడుగులు వేస్తున్నట్లు అమితాబ్ కాంత్ చెప్పారు. 

ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' పేరు


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement