ముగిసిన జీ20 సమావేశాలు | G20 Second Day Meetings Updates | Sakshi
Sakshi News home page

G20 Summit: ముగిసిన జీ20 సమావేశాలు

Published Sun, Sep 10 2023 9:05 AM | Last Updated on Sun, Sep 10 2023 3:06 PM

G20 Second Day Meetings Updates - Sakshi

Udates..

నవంబర్‌లో మరోసారి జీ20 దేశాలు వర్చువల్ సెషన్‌లో భేటీ కానున్నాయి. అప్పటి వరకు అధికారికంగా భారత్ అధ్యక్ష దేశంగా ఉండనుంది. 

► జీ20 సమ్మిట్ ముగిసిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్‌ ఫలవంతం అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.  

► జీ 20 సమావేశాలు ముగిశాయి. తదుపరి జీ 20 బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించింది భారత్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు బాధ్యతలను అందించారు.

జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు . గ్లోబల్ సౌత్‌కు మంచి ప్రాతనిధ్యం లభించిందని చెప్పారు. 

వసుధైక కుటుంబం విజయవంతమైందని త్రిపుర సీఎం మాణిక్ సాహా అన్నారు. జీ20 నిర్వహణలో భారత్ విజయం సాధించిందని చెప్పారు. 

 బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ గ్రీన్ క్లైమేట్ ఫండ్‌గా 2 బిలియన్ల డాలర్లను ప్రకటించారు. 

రెండోరోజు జీ20 సమావేశంలో వివిధ నేతల మధ్య దౌపాక్షిక సంబంధాలపై చర్చలతో పాటు కీలక అంశాల గురించి మాట్లాడుతారు. ఈ రోజు లంచ్ బ్రేక్‌ సందర్భంగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. 

జీ20 సమావేశం ముగిసిన అనంతరం జో బైడెన్ భారత్‌ నుంచి వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి వియత్నాం వెళ్లనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో తన విమానం ఎక్కారు. 

రాజ్‌ఘాట్‌ వద్ద జీ20 నేతలు మహాత్మాాగాంధీకి నివాళులు అర్పించారు. 

రాజ్‌ఘాట్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీకి చిత్రపటానికి నివాళులర్పించారు.

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మగాంధీకి నివాళులు అర్పించే కార్యక్రమం వద్ద ఏర్పాటు దృశ్యాలు

సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.

మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నాథ్‌ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.

బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనున్నారు.

ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. 

జీ20 ప్రతినిధులు రాజ్‌ఘాట్‌కు వచ్చారు. వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఖాదీతో స్వాగతం పలికారు. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ఇతర నాయకులు, ప్రతినిధులు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. 

జీ20 ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

జీ20 రెండో రోజులో భాగంగా దేశ విదేశీ ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. 

ఢిల్లీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. జీ20 రెండో రోజు కార్యక్రమాలకు వర్షం అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది.  

ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement