జీ20 సమ్మిట్‌: కనువిందు చేసిన రిషి సునాక్ దంపతులు.. | G20 Summit Rishi Sunak Akshata Murty Set Couple Goals | Sakshi
Sakshi News home page

జీ20 సమ్మిట్‌: కనువిందు చేసిన రిషి సునాక్ దంపతులు..

Published Sun, Sep 10 2023 2:19 PM | Last Updated on Sun, Sep 10 2023 4:48 PM

G20 Summit Rishi Sunak Akshata Murty Set Couple Goals - Sakshi

ఢిల్లీ: జీ20 సదస్సుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. సమావేశంలో భాగంగా భార్య భర్తల దృశ్యాలు నెటిజన్ల మనసును దోచేస్తున్నాయి. ఒకరంటే మరొకరు శ్రద్ద కనబరిచే దృశ్యాలకు నెట్టిళ్లు ఫిదా అయింది. 

ఢిల్లీకి చేరుకోగానే విమానం దిగే క్రమంలో అక్షతా మూర్తి.. రిషి సునాక్‌కు జాగ్రత్తగా టై కడుతున్న దృశ్యాలు.. వారి మధ్య ప్రేమానురాగాలను సూచించాయి. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎంత బాగుందో ఈ ఫొటోలు తెలుపుతున్నాయని నెటినజన్లు కామెంట్లు పెట్టారు. 

విమానం నుంచి దిగిన తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రిషి సునాక్ జంటకు స్వాగతం పలికారు. అనంతరం బ్రిటన్ ప్రధాని ఆయన భార‍్యతో కలిసి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ పిల్లలతో సరదాగా మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

శనివారం రాత్రి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జీ20 నేతలను విందుకు ఆహ్వానించారు. దేశ విదేశాల నేతలు భారతీయత ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి విందుకు వచ్చారు. అక్షతా మూర్తి ఇండియన్ స్టైల్‌లో వస్త్రాలు ధరించి, భర్తతో కలిసి ఉన్న దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. 

ఆదివారం ఉదయం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ దేవాలయాన్ని దర్శించారు. దేవుడికి ప్రార్ధనలు చేసి, హారతి ఇచ్చారు. ఈ క్రమంలో రిషి సునాక్ జంట హారతి ఇస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. భారతీయ జంటలాగే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది కదా..! దాంపత్యం అంటే అని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక కఠోర శ్రమ వీరిదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement