ప్రతిష్టాత్మక జీ20 అంతర్జాతీయ సదస్సును ఈ ఏడాది భారత్ నిర్వహిస్తోంది. దేశ రాజధానిలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమ్మిట్ జరగబోతోంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. జీ20 సదస్సు కోసం యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సెప్టెంబర్ 8న భారత్‌కు వస్తున్నారు.
జీ20 సమ్మిట్‌కు ఏర్పాట్లు చరుగ్గా సాగుతున్నాయి. సన్నాహకాల్లో భాగంగా న్యూఢిల్లీకి దక్షిణంగా ఉన్న ప్రధాన వ్యాపార కేంద్రమైన గురుగ్రామ్ బహుళజాతి కంపెనీలకు వర్క్-ఫ్రమ్-హోమ్ (WFH) సలహా జారీ అయింది. ఢిల్లీలో సమ్మిట్‌ను సజావుగా నిర్వహించేందుకు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు అమలు చేయనున్న ట్రాఫిక్ ఆంక్షలలో భాగంగా ఈ వర్క్ ఫ్రం హోం అడ్వయిజరీ జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు ఆయా రోజుల్లో స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు.
న్యూఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు
సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 11 మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. న్యూ ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్దిష్ట ట్రాఫిక్ నిబంధనలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో మెట్రో, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి 48 మినహా న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) పరిధికి వెలుపల ఉన్న ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Layoffs: భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!
Comments
Please login to add a commentAdd a comment