న్యూఢిల్లీ: దేశంలో త్వరలో జరిగే జీ20 సమావేశాన్ని కేంద్రప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేస్తోందని విమర్శించింది. 1999లో అవతరించిన జీ20లో 19 దేశాలు, ఈయూ సభ్యులుగా ఉన్నాయి.
ఇప్పటి వరకు 17 దేశాల్లో సమావేశాలు జరిగాయి. ఈసారి భారత్ వంతు వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా కేంద్రం దీనిని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటోంది’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment