కీవ్: ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. 2025 బడ్జెట్‌లో 32.5శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు.
రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్‌లో 28.3శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి.
Comments
Please login to add a commentAdd a comment