defense budget
-
సంపన్నుల సేవలో మోదీ సర్కారు: రాహుల్ గాంధీ
సోనిపట్: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ధనవంతుల సేవలో తరిస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అంబానీకి, అదానీకి మేలు చేయడానికే ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు తీసుకొచ్చినట్లు హరియాణాలో ఓ వ్యాపారి తనతో చెప్పాడని అన్నారు. మంగళవారం హరియాణాలోని సోనిపట్, బహదూర్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.‘‘ఇటీవల జరిగిన అంబానీ కుమారుడి పెళ్లి చూశారా? ఈ పెళ్లి కోసం అంబానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్మంతా ఎవరిది. అది ముమ్మాటికీ ప్రజలదే. మీ బిడ్డల పెళ్లి చేయాలంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ రైతు తన బిడ్డ పెళ్లి జరిపించాలంటే అప్పులపాలు కావాల్సిందే. కానీ, దేశంలో పిడికెడు మంది బడా బాబులు పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చుచేసేలా వారికి అనుకూలంగా నరేంద్ర మోదీ ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంపన్నుల సేవలో ఆయన తరిస్తున్నారు.ఇది రాజ్యాంగంపై దాడి కాక మరేమిటి?’’ అని నిలదీశారు. ఇద్దరు ముగ్గురు శ్రీమంతుల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వం, హరియాణాలో బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంబానీ, అదానీ పేర్లే కనిపిస్తున్నాయని ఆక్షేపించారు. రక్షణ రంగ బడ్జెట్‌ను అదానీకి కట్టబెట్టడానికి అగ్నిపాథ్ పథకం తీసుకొచ్చారని ఆరోపించారు. రక్షణ శాఖకు విక్రయిస్తున్న ఆయుధాలపై అదానీ కంపెనీ సొంత స్టిక్కర్లు వేసుకుంటోందని, వాస్తవానికి వాటిని విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయని చెప్పారు. -
మరింత శక్తివంతంగా చైనా సైన్యం
బీజింగ్: భారత్, తైవాన్లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి డాలర్‌తో యువాన్ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్–ఎన్సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ కేటాయింపులు 72 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. -
రక్షణ బడ్జెట్ పెంపు దిశగా చైనా
బీజింగ్: అమెరికాకు దీటుగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా చైనా మరో అడుగు ముందుకేసింది. ‘దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచుతున్నాం. ఆ మొత్తం ఎంత అనేది ఆదివారం జరగబోయే చైనా పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడిస్తాం’ అని ఆ దేశ పార్లమెంట్ అధికార ప్రతినిధి వాంగ్ చావో శనివారం చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.1 శాతం అధికంగా గత ఏడాది చైనా రక్షణ బడ్జెట్ కోసం 230 బిలియన్ డాలర్లను కేటాయించింది. 777.1 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌తో ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. మరోవైపు భారత రక్షణ బడ్జెట్ కంటే చైనా రక్షణ బడ్జెట్ మూడు రెట్లు మించి ఉండటం గమనార్హం. ‘ చైనా అంతర్జాతీయంగా చవిచూస్తున్న సంక్షిష్ట భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బడ్జెట్ పెంచడం అనివార్యం’ అని వాంగ్ చావో వ్యాఖ్యానించారు. మరోవైపు శనివారం చైనా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వారంపాటు జరగబోయే ఈ సమావేశాల్లో జిన్‌పింగ్ నాయకత్వంలో కొనసాగే నూతన మంత్రివర్గాన్ని, ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ స్థానంలో నూతన ప్రధానిని ప్రకటిస్తారు. నాయకత్వ మార్పులో భాగంగా ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ ‘రబ్బర్‌స్టాంప్’ తంతులో కొలువుతీరే కొత్త వారంతా దాదాపు జిన్‌పింగ్ ఆజ్ఞలను శిరసావహించేవారే. రెండు సెషన్లుగా జరిగే పార్లమెంట్ భేటీలో దశలవారీగా మొత్తంగా 5,000 మంది పాల్గొంటారు. ప్రధానిగా లీ కెక్వియాంగ్ స్థానంలో లీ క్వియాంగ్ను ఎంపికచేసినట్లు వార్తలొచ్చాయి. -
ప్రపంచ మిలటరీ బడ్జెట్.. 2,00,000 కోట్ల పైనే
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) ప్రపంచంలో స్వీయ రక్షణ కోసం వివిధ దేశాలు చేస్తున్న వ్యయం ఏటా పెరుగుతోంది. ఆధునిక యుగంలోనూ మిలటరీ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్ 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని స్వీడన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ నివేదిక వెల్లడించింది. 1949 నుంచి వివిధ దేశాల మిలటరీ బడ్జెట్లను విశ్లేషిస్తూ ఈ సంస్థ ఏటా నివేదికలు వెలువరిస్తోంది. మిలటరీ వ్యయం అంటే కేవలం సైన్యాన్ని పోషించడం, మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు.. పరిశోధన–అభివృద్ధి వ్యయం కూడా భాగమే. ప్రపంచ మిలటరీ బడ్జెట్ గత ఏడేళ్లుగా పెరుగుతూ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో అమెరికా వాటా దాదాపు 38 శాతం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం 80 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. 29.3 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసిన చైనా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ దేశాల మొత్తం మిలటరీ వ్యయంలో చైనా వాటా దాదాపు 14 శాతం. అలాగే, అమెరికా, చైనా దేశాల మిలటరీ వ్యయం.. మొత్తం ప్రపంచ దేశాల మిలటరీ వ్యయం కంటే కాస్త ఎక్కువే. చైనా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు మిలటరీ బడ్జెన్‌ను గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెంచుతున్న దేశం చైనా. 2012లో చేసిన వ్యయంతో పోలిస్తే 2021లో పెట్టిన ఖర్చు రెట్టింపు అయింది. గత 27 ఏళ్లుగా చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. ► అమెరికా ఒక్క దేశం చేస్తున్న రక్షణ వ్యయాన్ని పరిశీలిస్తే.. టాప్–10 దేశాల జాబితాలోని మిగతా 9 దేశాల మొత్తం మిలటరీ వ్యయం కంటే ఈ దేశానిది ఎక్కువే. అలాగే.. ► సౌదీ అరేబియా తన మొత్తం జీడీపీలో 6.6 శాతం ఖర్చుచేస్తోంది. రష్యా 4.1 శాతం వ్యయం చేస్తోంది. ► ఇక 7.66 వేల కోట్ల డాలర్ల వ్యయంతో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ మిలటరీ వ్యయంలో భారత్ మిలటరీ వ్యయం 3.6 శాతం. ► తర్వాత స్థానంలో ఉన్న యూకే 3.2 శాతం వాటాతో 6.84 వేల కోట్ల డాలర్ల వ్యయం చేసింది. ► 5వ స్థానం రష్యాది. ఈ దేశం 3.1 శాతం వాటాతో 6.59 వేల కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చుచేసింది. ► ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 2.7 శాతం వాటాతో 5.66 వేల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. ► ఏడో స్థానంలో ఉన్న జర్మనీ కూడా దాదాపు ఫ్రాన్స్‌తో సమానంగా ఖర్చు చేసింది. ► 8వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా వెచ్చించింది 5.56 వేల కోట్ల డాలర్లు (2.6 శాతం). ► 9వ స్థానంలో 5.4 వేల కోట్ల డాలర్ల (2.6 శాతం) వ్యయంతో జపాన్ ఉంది. ► ఇక పదో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 5.02 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి ప్రపంచ మిలటరీ వ్యయంలో 2.4 శాతం వాటా దక్కించుకుంది. ఈ 10 దేశాలు మినహా ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలు కలిపినా 53.6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో వాటి వాటా 25.3 శాతం మాత్రమే. ఆంక్షల మంత్రమే నేటి యుద్ధ తంత్రం ఆధునిక యుగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, సైన్యాన్ని పెంచుకోవడమే ఆధునిక యుద్ధ తంత్రం కాదని అగ్రదేశాలు పలుమార్లు నిరూపించాయి. ఆంక్షలు విధించడం, ఎగుమతులు–దిగుమతులను నియంత్రించడం, అధిక పన్నులు విధించడం, సరఫరాలు నిలిపివేయడం.. చేస్తున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తినప్పుడు.. రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనవద్దని మన దేశం మీద కూడా ఒత్తిళ్లు వచ్చాయి. ఇక దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. మిలటరీ కంప్యూటర్ వ్యవస్థల భద్రతకు అన్ని దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. -
ట్రంప్‌కి అమెరికా కాంగ్రెస్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్ కాంగ్రెస్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రంప్ హయాంలో అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిరాజని ఒక బిల్లు చట్ట రూపం దాల్చడం ఇదే తొలిసారి. రిపబ్లికన్ పార్టీకి బలం ఉన్న కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్ కూడా ట్రంప్ అధికారాన్ని పక్కకు పెట్టి నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)ని 81–13 ఓట్ల తేడాతో ఆమోదించడం గమనార్హం. ఈ పరిణామంతో అధికారానికి దూరమవుతున్న క్షణాల్లో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్‌కి ఎదురు దెబ్బ తగిలిట్టనయింది. ఈ వారం మొదట్లోనే ప్రతినిధుల సభ ఈ బిల్లుని 322–87 ఓట్లతో ఆమోదించింది. ట్రంప్ రక్షణ బిల్లుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు దేశ భద్రతకు భంగకరంగా ఉన్నాయన్నది ఆయన వాదన. కానీ అమెరికా ప్రజాప్రతినిధులు మాత్రం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేశారు. సాధారణంగా కాంగ్రెస్‌లోని రెండు సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని వినియోగించి బిల్లుని తిప్పి పంపడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు బిల్లుని వీటో చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లుని చట్టంగా మార్చే అవకాశం ఉంది. ట్రంప్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్‌లో ఉభయ సభలు ఆయన సంతకం అవసరం లేకుండానే బిల్లుని ఆమోదించాయి. దేశ భద్రత, మిలటరీ అవసరాలు, సైనిక కుటుంబాలకు అండగా ఉండడానికి కావల్సిన నిధులను మంజూరు చేసే బిల్లు కావడంతో కాంగ్రెస్ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆమోదించింది. భారత్‌లో 19 వేల కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 19,079 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌తో 224 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,218కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,06,387కు చేరిం. రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యూకే నుంచి భారత్‌కు వచ్చిన మరో నలుగురికి బ్రిటన్ వేరియంట్ కరోనా సోకింది. దీంతో మొత్తం బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 33కు చేరింది. -
రక్షణ బడ్జెట్ మరింత పెంచిన చైనా
బీజింగ్: ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రక్షణ రంగానికి అత్యధికంగా నిధుల్ని కేటాయించే చైనా ఈ ఏడాది మరింతగా బడ్జెట్‌ను పెంచింది. గత ఏడాది 177 బిలియన్ డాలర్లుగా ఉన్న బడ్జెట్‌ను 6.6 శాతం పెంచుతూ ఈసారి 179 బిలియన్ డాలర్లను కేటాయించింది. భారత్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. కోవిడ్–19 ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. కాగా, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరుబాట పట్టిన హాంకాంగ్‌పై మరింత పట్టుబిగిస్తూ జాతీయ భద్రతా ముసాయిదా బిల్లును చైనా ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. -
బడ్జెట్‌కు పాక్ ఆర్మీ స్వచ్ఛంద కోత
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు మద్దతిస్తూ పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌కు కేటాయించే నిధులను స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు. ‘దేశ భద్రత, రక్షణ విషయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోం. అన్ని ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించాలి. ముప్పులను దీటుగా ఎదుర్కొగలిగేలా సామర్థ్యాన్ని కొనసాగించాలి. బడ్జెట్లో కోత వల్ల కలిగే ఇబ్బందులను త్రివిధ దళాలు తగిన అంతర్గత చర్యల ద్వారా సర్దుబాటు చేసుకుంటాయి. దేశంలోని గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్ అభివృద్ధిలో పాలుపంచుకోవడమే మాకు ముఖ్యం’ అని ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. పలు భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ దేశం కోసం వారు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
రక్షణకు మేం రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి 2019–20 బడ్జెట్లో రూ. 3,18,931 కోట్లు కేటాయించారు. గత ఏడాది రక్షణ శాఖ బడ్జెట్‌తో కేటాయింపు రూ. 2,95,511 కోట్లతో పోలిస్తే ఇది 6.87 శాతం ఎక్కువగా తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర పరికరాలు కొనడానికి బడ్జెట్ కేటాయింపులో రూ. 1,08,248 కోట్లను మూలధనంగా పేర్కొన్నారు. మూలధనం ఆర్మీకి రూ. 29,447 కోట్లు, నేవీకి రూ. 23,156 కోట్లు, ఎయిర్‌ఫోర్స్‌కు రూ. 39,302 కోట్లు కేటాయించారు. ఇక జీతాల చెల్లింపు తదితర రెవెన్యూ వ్యయానికి రూ. 2,10,682 కోట్లు కేటాయించారు. కేంద్రం ప్రభుత్వం మొత్తం మూలధనంలో 32.19 శాతం సాయిధ బలగాలకు కేటాయించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యయం మొత్తంలో 15.48 శాతం రక్షణ రంగం కేటాయింపులేనని చెప్పారు. రక్షణ రంగానికి ఇచ్చిన దానికి అదనంగా పెన్షన్ల కోసం రూ. 1,12,079 కోట్లను కేటాయించారు. సరిహద్దులను కాపాడటానికి అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమని పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులు గర్వకారణమని, అందుకే ఈ ఏడాది వారికోసం ఇప్పటివరకూ ఎవరూ కేటాయించని స్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు. నలభైఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒకే హోదా ఒకే పింఛన్‌ను తాము పరిష్కరించామని తెలిపారు. యూపీఏ సర్కారు 2014–15 మధ్యంతర బడ్జెట్లో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయిస్తే తాము ఆ పథకం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.35 వేల కోట్లు పంపిణీ చేశామని పీయూష్ అన్నారు. యూపీఏ ఒకేహోదా ఒకే పింఛన్ (వన్ ర్యాంక్ వన్ పింఛన్)ను మూడు బడ్జెట్లలో ప్రస్తావించినప్పటికీ అమలు చేసింది మాత్రం తామేనంటూ ఆయన.. ‘మిలటరీ సర్వీస్ పే’లో అన్ని దళాల వారికీ అలవెన్సులను గణనీయంగా పెంచామని వివరించారు. అంతేకాకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న నేవీ, వాయుసేనల సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక అలవెన్సులను కూడా ఎక్కువ చేశామని గుర్తు చేశారు. హోం మంత్రిత్వ శాఖకు 1,03,927 కేంద్ర హో మంత్రిత్వ శాఖకు కేటాయింపులు తొలిసారి లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2019–20 కేంద్ర బడ్జెట్లో హోం మంత్రిత్వ శాఖకు రూ. 1,03,927 కోట్లు కేటాయించారు. 2018–19 బడ్జెట్లో ఆ శాఖకు రూ. 99.03వేల కోట్లతో పోలిస్తే ఈ సారి 4.9 శాతం ఎక్కువ. దేశ రాజధానిలో శాంతిభద్రత కాపాడే ఢిల్లీ పోలీసులకు ఈ బడ్జెట్లో రూ. 7,496.91 కోట్లు, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సీఆర్పీఎఫ్ బలగాల కోసం రూ. 23,742.04 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సీఆర్పీఎఫ్కు దాదాపు రూ. 1,095 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం బీఎస్ఎఫ్ కోసం 19,647.59 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,061 కోట్లు అదనం. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు సాయిధ బలగాల కోసం మొత్తం రూ. 71,618.70 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ. 67,779.75గా ఉన్నాయి. ఇతర కేటాయింపులు.. - ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఈ బడ్జెట్లో రూ. 2,198.35 కోట్లు కేటాయించారు. - ప్రధాని, మాజీ ప్రధాని భద్రతకోసం వినియోగించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌నకు రూ. 530.75 కోట్లు ఇచ్చారు. - పోలీస్ మౌలిక వసతుల అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాల కొనుగోళ్లు, బారక్‌లు, ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5,117 కోట్లు ఇచ్చారు. - పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రూ. 3,378 కోట్లు, సరిహద్దులో మౌలిక వసతులు, నిర్వహణకు రూ. 2 వేల కోట్లు, మహిళల రక్షణ, సాధికారత మిషన్‌కు రూ. 1,330 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి రూ. 825 కోట్లు, జమ్మూకశ్మీర్‌లో వలసదారులు, స్వదేశానికి తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం రూ. 809 కోట్లు, స్వాతంత్య్ర పోరాటయోధుల పింఛన్ల కోసం రూ. 953 కోట్లు, నిర్భయ ఫండ్‌కు రూ. 50 కోట్లు కేటాయించారు. - ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు రిలీఫ్ ఫండ్‌కు రూ. 10,000 కోట్లు కేటాయించారు. - రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా 2021 జనాభా లెక్కలకు రూ. 541.33 కోట్లు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు రూ. 50 కోట్లు, జమ్మూ కశ్మీర్లో పరిశ్రమల ఏర్పాటుకు రూ. 78.09 కోట్లు, హిందీ భాష ప్రచారానికి రూ. 4,895.81 కోట్లు కేటాయించారు. - కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ అండ్ నికోబార్ దీవులకు రూ. 4,817.48 కోట్లు, చండీగఢ్‌కు రూ. 4,291.70 కోట్లు, దాద్రా నగర్ హవేలీకి రూ. 1,117.99 కోట్లు, డామన్ అండ్ డయ్యు రూ. 821.4 కోట్లు, లక్షద్వీప్‌కు రూ. 1,276.74 కోట్లు ఢిల్లీకి రూ.1,112 కోట్లు, పుదుచ్చేరికి రూ. 1,545 కోట్లు కేటాయించారు. కంచె.. కాస్త పలచబడింది! ‘జై జవాన్’ అన్నది పేరుకేనా? సమయం దొరికినపుడల్లా సైనికుల గొప్పలు చెప్పే మోదీ సర్కారు.. రక్షణరంగానికి చేసిన కేటాయింపులెంత? ఆయుధాల దిగుమతుల్లో అతిపెద్ద దేశమైన మనకు.. ప్రస్తుత తరుణంలో రక్షణరంగ కేటాయింపులేమీ పెరగలేదు. రూ.3 లక్షల కోట్లకన్నా ఎక్కువ కేటాయించామని, ఈ స్థాయి నిధులివ్వటం ఇదే తొలిసారని చెబుతున్నారు. కానీ ఆయుధాలు కొనేది డాలర్లలో. గతేడాది డాలర్ విలువ ఇప్పటికన్నా చాలా తక్కువ. దీంతో గతేడాది కేటాయింపులు దాదాపు 44.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇపుడు రూ.3 లక్షల కోట్లు దాటినా... డాలర్లలో మునుపటేడాది కన్నా తక్కువే. డాలర్లలో గతేడాది కేటాయింపులు 44.5 బిలియన్లు డాలర్లలో ప్రస్తుత కేటాయింపులు 43 బిలియన్లు -
రక్షణకు 11 లక్షల కోట్లు
బీజింగ్: భారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది. రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు– దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బహుళ పార్టీ వ్యవస్థతో అర్థం లేని పోటీ బహుళ పార్టీ ప్రజాస్వామ్యంతో పార్టీల మధ్య ‘అనారోగ్యకర పోటీ’ నెలకొంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. చైనా అనుసరిస్తున్న ఏక పార్టీ వ్యవస్థే మంచిదన్నారు. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ‘చైనా వ్యవస్థ కొత్తది. ఎందుకంటే ఇది అన్ని రాజకీయ పార్టీలను, పార్టీల ప్రమేయం లేని ప్రజలను ఉమ్మడి లక్ష్యం కోసం ఏకం చేస్తుంది. అధికార మార్పి డి, పార్టీల మధ్య అనారోగ్యకర పోటీతో వచ్చే నష్టాలు లేకుండా చేస్తుంది’అని అన్నారు. -
మా అభివృద్ధితో ఎవరికీ హాని లేదు : చైనా
బీజింగ్: తమ దేశ అభివృద్ధితో ఇతర దేశాలకు ఎటువంటి హాని ఉండదని చైనా వెల్లడించింది. చాలా ఏళ్ల తర్వాత చైనా వార్షిక పార్లమెంట్ సమావేశంలో జాతీయ రక్షణ బడ్జెట్ నివేదికను ప్రకటించకపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రక్షణ బడ్జెట్‌ను వాటాల వారీగా ప్రవేశపెట్టేవారు. అయితే ఈ ఏడాది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నూతన అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాంగ్ ఎసుయ్..రక్షణ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. చైనా ఎప్పుడూ శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా జాంగ్ వెల్లడించారు. చైనా ప్రతి ఏడాది తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. గతేడాది చైనా రక్షణ బడ్జెట్ భారత్ కంటే మూడింతలు అధికంగా ఉంది. -
అమెరికా రక్షణ బడ్జెట్ 45 లక్షల కోట్లు
వాషింగ్టన్: వచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం–2018(ఎన్డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్ డాలర్ల(సుమారు రూ.45.44 లక్షల కోట్లు) ఈ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి ఇందులో చోటు కల్పించారు. తదుపరి దశలో ట్రంప్ సంతకం చేసిన తర్వాత∙ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ హోదా భారత్‌కే ప్రత్యేకం భారత్‌కు అమెరికా కల్పించిన ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాపై ఉమ్మడి నిర్వచనం ఇవ్వాలని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులను బిల్లు కోరింది. ప్రస్తుత లక్ష్యాలు, ఆశయాల ఆధారంగా భారత్‌తో రక్షణ సంబంధాల బలోపేతానికి ముందుచూపుతో కూడిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని పెంటగాన్‌కు సూచించింది. దాని ప్రకారం...ఉభయ దేశాలు అఫ్గానిస్తాన్‌తో కలసి పనిచేసి ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి కృషిచేయాలి. అఫ్గాన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులు పెట్టడం, విపత్తు సాయం లాంటివి అందులో ఉంటాయి. 2017 రక్షణ బడ్జెట్లోనే భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గౌరవం భారత్‌కే ప్రత్యేకమని, దీని వల్ల రెండు దేశాల మధ్య రక్షణ వ్యాపారం, సాంకేతిక సహకారం అమెరికా మిత్ర దేశాలతో సమాన స్థాయికి చేరుతుందని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. సర్టిఫికెట్ ఇస్తేనే నిధులు ఈ బిల్లు ప్రకారం సంకీర్ణ మద్దతు ఫండ్ (సీఎస్ఎఫ్) కింద పాక్‌కు అమెరికా 350 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2,272 కోట్లు) సాయం అందించనుంది. ఈ సాయం పొందాలంటే ఉగ్రసంస్థ హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ కఠిన చర్యలు తీసుకుంటోందని అమెరికా రక్షణ మంత్రి సర్టిఫికెట్ ఇవ్వాలి. అమెరికా గత రక్షణ మంత్రులు పాక్‌కు ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఉగ్ర సంస్థలపై ఆ దేశం చర్యలు తీసుకోవడం అమెరికాకు ముఖ్యమని ఈ బిల్లుతో పాటు ఆమోదం పొందిన అనుబంధ కాన్ఫరెన్స్ రిపోర్టు పేర్కొంది. నిధులను పాక్ ఉగ్ర కార్యకలాపాలకు వాడకుండా పరిశీలిస్తూ ఉండాలని కోరింది. నిధులను బలూచీ, సింధి లాంటి మైనారిటీలపై వేధింపులకు పాల్పడటానికి వాడొద్దు. -
రక్షణ బడ్జెట్‌ను 10% పెంచనున్న చైనా
బీజింగ్: సైనిక పాటవంలో అగ్రరాజ్యానికి దీటుగా సత్తా చాటాలని భావిస్తున్న చైనా తన రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను ఈ ఏడాది కూడా 10 శాతం పెంచనుంది. పొరుగుదేశాలతో భూ, జల వివాదాలకు కాలుదువ్వుతున్న చైనా రక్షణ బడ్జెట్‌ను రెండంకెల శాతంతో పెంచడం వరుసగా ఇది ఐదోసారి కానుంది. చైనా రక్షణ బడ్జెట్ ఈ ఏడాది 14,500 కోట్ల డాలర్ల(సుమారు రూ. 9 లక్షల కోట్లు)కు చేరనుందని అంచనా. అయితే, చైనాతో పోల్చితే భారత రక్షణ బడ్జెట్ కేవలం 4 వేల కోట్ల డాలర్లు(రూ.2.46 లక్షల కోట్లు) మాత్రమే కావడం గమనార్హం.