బీజింగ్: సైనిక పాటవంలో అగ్రరాజ్యానికి దీటుగా సత్తా చాటాలని భావిస్తున్న చైనా తన రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను ఈ ఏడాది కూడా 10 శాతం పెంచనుంది. పొరుగుదేశాలతో భూ, జల వివాదాలకు కాలుదువ్వుతున్న చైనా రక్షణ బడ్జెట్‌ను రెండంకెల శాతంతో పెంచడం వరుసగా ఇది ఐదోసారి కానుంది. చైనా రక్షణ బడ్జెట్ ఈ ఏడాది 14,500 కోట్ల డాలర్ల(సుమారు రూ. 9 లక్షల కోట్లు)కు చేరనుందని అంచనా. అయితే, చైనాతో పోల్చితే భారత రక్షణ బడ్జెట్ కేవలం 4 వేల కోట్ల డాలర్లు(రూ.2.46 లక్షల కోట్లు) మాత్రమే కావడం గమనార్హం.