బీజింగ్: తమ దేశ అభివృద్ధితో ఇతర దేశాలకు ఎటువంటి హాని ఉండదని చైనా వెల్లడించింది. చాలా ఏళ్ల తర్వాత చైనా వార్షిక పార్లమెంట్ సమావేశంలో జాతీయ రక్షణ బడ్జెట్ నివేదికను ప్రకటించకపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రక్షణ బడ్జెట్‌ను వాటాల వారీగా ప్రవేశపెట్టేవారు. అయితే ఈ ఏడాది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నూతన అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాంగ్ ఎసుయ్..రక్షణ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. చైనా ఎప్పుడూ శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా జాంగ్ వెల్లడించారు. చైనా ప్రతి ఏడాది తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. గతేడాది చైనా రక్షణ బడ్జెట్ భారత్ కంటే మూడింతలు అధికంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment