National Peoples Congress
-
చైనా ప్రధానిగా కియాంగ్
బీజింగ్: చైనా ప్రధానిగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడైన లీ కియాంగ్ (63) నియమితులయ్యారు. పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) తీసుకున్న ఈ నిర్ణయానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఈ మేరకు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. లీ పేరును జిన్‌పింగ్ స్వయంగా ప్రతిపాదించారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం విశేషం! మొత్తం 2,936 మంది ఎన్పీసీ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటేయగా మరో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం లీ నియామక ఉత్తర్వులపై జిన్‌పింగ్ సంతకం చేశారు. ఆ వెంటనే ప్రస్తుత ప్రధాని లీ కీ కియాంగ్ నుంచి లీ బాధ్యతలను స్వీకరించారు. ఒడిదుడుకులమయంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే గురుతర బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. అందుకు చేపట్టబోయే చర్యలను మార్చి 13న మీడియా సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. లీకి వ్యాపారవేత్తల పక్షాన నిలుస్తారని పేరుంది. తాజా మాజీ ప్రధాని లీ కి కియాంగ్‌కు కొన్నేళ్లుగా జిన్‌పింగ్‌తో దూరం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు అధ్యక్ష పీఠానికి పోటీదారుగా నిలిచిన ఆయన ప్రధానిగా తన అధికారాలకు జిన్‌పింగ్ పూర్తిగా కోత పెట్టడంపై అసంతృప్తిగా ఉన్నారు. పదవి నుంచి వైదొలగిన ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతున్నారు. -
మరింత శక్తివంతంగా చైనా సైన్యం
బీజింగ్: భారత్, తైవాన్లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి డాలర్‌తో యువాన్ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్–ఎన్సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ కేటాయింపులు 72 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. -
మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా...సవరింపు చట్టం
హాంకాంగ్: లింగ వివక్ష, లైంగిక వేధింపుల నుంచి చైనాలో మహిళలకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని సవరించింది. విస్తృతమైన ప్రజాభిప్రేయ సేకరణ, పలు సవరణలు తదనంతరం ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించింది. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రభుత్వం వారికి తగిన గౌరవం దక్కేలా చేయడం, అబార్షన్ పట్ల వస్తున్న నిర్భంధ వైఖరి తదితరాలపై కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత చైనా మహిళల రక్షణ చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ చట్టం ముసాయిదాను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) స్టాండింగ్ కమిటీకి సమర్పించింది. ఐతే ఈ ముసాయిదాను ఇంకా అమలు చేయలేదు. సుమారు 10 వేల మంది ప్రజల సలహాలు, సూచనల కోసం పంపినట్లు ఎన్పీసీ తెలిపింది. ఈ ముసాయిదా చట్టం వెనుకబడిన, పేద, వృద్ధ, వికలాంగ మహిళల హక్కుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తోందని స్థానిక జిన్హుహ వార్త సంస్థ పేర్కొంది. ఈ చట్టం ప్రకారం....మహిళల శ్రమ, సామాజిక భద్రత హక్కుల ప్రయోజనాలను ఉల్లంఘిస్తే సదరు యజమానులను శిక్షిస్తుంది. మహిళల అక్రమ రవాణ, కిడ్నాప్, రక్షణను అడ్డుకోవడం తదితరాలను నేరాలుగా పరిగణిస్తుంది. అలాగే అక్రమ రవాణాకు గురైన లేదా కిడ్నాప్‌కి గురైన మహిళలను రక్షించే బాధ్యత అధికారులపై ఉంటుందని స్పష్టం చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
అసమానతలు రూపుమాపడమే అజెండా
‘ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’... ప్రపంచంలోని ఏ మూలనైనా సరే ఈ పేరు వినగానే ఆశ్చర్యం, కోపం, జాగరూకత వంటి అనేక భావాలు వ్యక్తమవుతాయి. అంతేకాదు.. పెత్తందారీ పోకడలు, అప్రజాస్వామిక, అణచివేత ధోరణులు, దురహంకార పూరిత దేశంగా కొందరికీ... భారీ ప్రాజెక్టులు, విశాలమైన రహ దారులతో అభివృద్ధికి వేగంగా బాటలు వేసుకున్న దేశంగా ఇంకొందరికీ గుర్తుంటుంది. విషయం ఏమిటంటే.. ఈ ఆలోచన లన్నింటి వెనుక ఉన్న శక్తి.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ). అక్టోబరు 16వ తేదీ నుంచి తన ఇరవయ్యవ జాతీయ కాంగ్రెస్ సమావేశాలను ఇది నిర్వహించుకుంటోంది. ఈ సమావేశాల తరువాత షీ జిన్‌పింగ్ అనూహ్యంగా... మూడోసారి పార్టీ జనరల్ సెక్రటరీగా ఎంపిక కానున్నారు. పాలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఇంకో ఆరుగురి ఎంపిక కూడా ఈ సమావేశాల్లోనే జరుగుతుంది. చైనాలో నాయకత్వ మార్పును సూచించే రెండు సమావేశాల్లో ఇది ప్రధానమైంది. వచ్చే ఏడాది మార్చిలో చైనా ప్రభుత్వ నాయకత్వం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌నూ మార్చేయనుంది. బహుశా ఆ తరు వాతి కాలంలో దేశానికి ఒక కొత్త ప్రీమియర్ నియామకం జరిగే అవకాశం ఉంది. చిట్టచివరిగా పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు చోటు చేసు కున్నది 2017 మధ్యకాలంలో! అప్పటికీ, ఇప్పటికీ చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ఒక బలీయమైన శక్తిగా ఎదగాలన్న దాని ఆకాంక్ష వ్యక్తీకరణకూ వేదిక ఈ సమావేశాలే. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు ఈ సమావేశాలు నాయకత్వ మార్పిడి జరిగే వేదిక గానే కాకుండా... గత సమావేశాల నుంచి సాధించిన ప్రగతిని సమీక్షించేందుకూ, రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అంశాలపై ప్రణాళిక రచనకూ కేంద్రం. ఇదంతా జనరల్ సెక్రటరీ సమర్పించే నివేదిక ద్వారా వ్యక్తమవుతుంది. 2017లో షీ జిన్ పింగ్ సుమారు మూడున్నర గంటలపాటు ఏకధాటిగా ప్రసం గించి ‘కలల చైనా’ అన్న ఇతివృత్తంపై మాట్లాడారు. ఈసారి అటువంటి అద్భుత ప్రసంగమే జరగవచ్చు. షీ జిన్‌పింగ్ పార్టీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎంపిక కావడం ఇప్పుడు లాంఛనమే. 2012లో జిన్‌పింగ్ అధికారం చేపట్టినప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండేది. గృహనిర్మాణం వంటి రంగాల్లో లోటుపాట్లేవీ పైకి కనిపించేవి కూడా కాదు. గృహ వినియోగం క్రమేపీ పెరుగుతూండేది. ఎగు మతులు లక్ష్యంగా పెట్టుబడులూ వస్తూండేవి. అంతేకాదు... స్థానికంగా వ్యాపారం చేసుకునే వాతావరణమూ ఇప్పటిలా కాకుండా... చాలా సానుకూలంగా ఉండేది. మైనార్టీల అణచివేత వంటి చైనా అరాచకాల గురించి అప్పట్లోనూ అందరికీ తెలుసు కానీ అదింకా సామూహిక కారాగారాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరలేదు. హాంకాంగ్‌తో సంబంధాలూ ఒడుదొడుకుల్లేకుండానే సాగేవి కానీ ‘నేషనల్ సెక్యూరిటీ లా’ పేరుతో ఇప్పుడు ఆ పరి స్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో చైనాను ఓ ప్రత్యర్థి/పోటీదారుగానే చూశారు కానీ విధ్వంసం సృష్టించే దేశంగా చూడలేదు. ఇరుగు పొరుగుతో చైనా సంబంధాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. కోవిడ్–19 కట్టడిలో విఫలమైన తరువాత, ఉక్రె యిన్‌పై రష్యా దాడులకు మద్దతు తరువాత చైనాను బాధ్యతాయుతమైన దేశంగా పరిగణించడమూ తగ్గింది. తైవాన్ సరిహద్దులపై క్షిపణులు ప్రయో గించడం, అది కూడా అమెరికా స్పీకర్ అక్కడకు వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే జరగడం ప్రపంచం దృష్టిని దాటలేదు. అందుకేనేమో... చైనా ఓ నిరపాయకరమైన దేశం కాదన్న భావనపై అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఏర్పడుతోంది. ఇవన్నీ ఒకవైపున సాగుతూండగానే జిన్‌పింగ్ చైనాలో కమ్యూనిస్టు పార్టీని అన్నింటికీ కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య ఘర్షణ; అపోహల వంటివాటికి స్థానం లేకుండా దేశంలోని అన్ని రకాల సంస్థలకూ డీఫ్యాక్టో ఛైర్మన్‌గా మారిపోయాడు. అందుకే షీ జిన్‌పింగ్‌ను ‘ఛైర్మన్ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ నాయకత్వానికి పోటీని పూర్తిగా తొలగించారు షీ జిన్‌పింగ్. నాయకత్వానికి పోటీ కాస్తా వర్గపోరుగా మారిపోతూండటం... పుకార్లు ప్రచారంలో పెట్టడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం జరుగు తూండటం వంటివన్నీ తగ్గిపోయాయి. సవాలు విసిరిన స్థానిక అవినీతిని కూడా జిన్‌పింగ్ దీటుగానే ఎదుర్కొన్నాడు. అవినీతి నిర్మూలన ప్రయత్నాలు కాస్తా రాజకీయ ప్రక్షాళనకూ దారి తీశాయి. కానీ ఈ ప్రస్థానంలో ఉమ్మడి నాయకత్వమన్న ఆలోచనకు ఫుల్స్టాప్ పడింది కూడా. జిన్‌పింగ్‌కు అన్ని విధాలుగా మద్దతు లభించేందుకు వీలుగా దాదాపు 30 ఏళ్ల తరువాత ‘మూల నేత’ అన్న భావనను ముందుకు తెచ్చారు. జిన్‌పింగ్ సాధించిన అనేకానేక ఘనతల్లో చైనీస్ మిలటరీ ప్రక్షాళన కూడా ఒకటి. లంచాలకు మరిగారన్న ఆరోపణపై ఉన్నత స్థానంలో ఉన్న పలువురు అధికారులను కటకటాల వెనక్కు తోసేశారు. అదే సమయంలో మానవ హక్కులపై పోరాడుతున్న అనేకమంది న్యాయవాదులనూ అరెస్ట్ చేయడం, ఫెమినిస్టు వర్గాలపై కూడా ఉక్కుపాదం మోపడం, విదేశీ భావజాలం వ్యాపించకుండా అణచివేయడం కోసం యూనివర్సిటీ తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటివి ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైన చర్యలు. ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే చైనా కూడా బలీయమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటోంది. అయితే వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి సవాళ్లు బయటి నుంచి ఎదురవుతున్నాయి. అయితే చైనా తన అధికారాన్ని విస్తరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సవాళ్లూ లేక పోలేదు. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, వినియో గమూ తగ్గిపోతూండటం వాటిల్లో కొన్ని మాత్రమే. ఏంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూపై చెలరేగిన వివాదం వ్యాపారం చేసుకునే వాతావరణంపై సందేహాలు లేవనెత్తింది. పైగా కోవిడ్ కట్టడికి చేపట్టిన అనేక చర్యలు చైనాలో సాధారణ పరిస్థితులు నెల కొంటాయన్న ఆలోచనలపై చన్నీళ్లు చల్లాయి. చైనీయుల్లోనూ నిరాశా నిస్పృహలనూ, కోపాన్నీ పెంచాయి. సుమారు రెండు వేల మంది పార్టీ ప్రతినిధులు పైన పేర్కొన్న అనేక అంశాలపై పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లడం, భవిష్యత్తు ప్రణాళికను ఆమోదించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి బీజింగ్‌లో సమావేశమవుతున్నారు. చైనాలోని అసమానతలను రూపుమాపడానికి అవసరమైన సామూహిక వృద్ధి అన్న పార్టీ కేంద్ర భావన ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషించనుంది. స్థానికంగా వినియోగాన్ని పెంచడం, కొత్త కొత్త ఆవిష్కరణలు, స్థానికంగా పోటీతత్వాన్ని మరింత పెంచడం ద్వారా అసమానతలను తగ్గించాలని చైనా యోచి స్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి సమావేశాల తరువాత చైనా ప్రపంచం దృష్టిలో తన ఇమేజ్ను మార్చు కునేందుకు ప్రయత్నిస్తుందన్న అంచనాలున్నాయి. ఏం జరుగనుందో వచ్చే వారం రోజుల్లో బహిర్గతమవుతుంది. అవినాశ్ గోడ్బోలే , వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఓపీజేజీయూ (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
జిన్‌పింగ్ పట్టాభిషేకం
తలపెట్టినవేవీ కొనసాగక విఫలుడై సెలవంటూ వెళ్లిపోవాల్సిన చైనా అధినేత జిన్‌పింగ్ సంప్రదాయానికి భిన్నంగా వరసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కాబోతున్నారు. వారంపాటు జరిగే పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ఆదివారం ప్రారంభమవుతాయి. వచ్చే మార్చిలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) సమావేశాలు దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకున్నా, దేశాధ్యక్షుడిగా మాత్రం జిన్‌పింగే కొనసాగుతారు. అయిదేళ్లకోసారి నిర్వహించే పార్టీ మహాసభలో జరిగే సిద్ధాంత చర్చలూ, తీసుకునే నిర్ణయాలూ లాంఛనప్రాయమైనవే. అన్నీ ముందే ఖరారవు తాయి. పార్టీ కాంగ్రెస్ చేయాల్సిందల్లా వాటికి ఆమోదముద్రేయడమే. మావో తిరుగులేని అధి నేతగా, యావజ్జీవ అధ్యక్షుడిగా దీర్ఘకాలం కొనసాగడం వల్ల దేశం నష్టపోయిందని భావించిన డెంగ్ ఆ ఒరవడికి స్వస్తి పలికారు. ఎవరైనా రెండు దఫాలు మాత్రమే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేలా నియమావళి మారింది. జిన్‌పింగ్ 2018లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో దీన్ని తిరగ దోడగలిగారు. సమష్టి నాయకత్వాన్ని ప్రవచించే కమ్యూనిస్టు పార్టీల్లో క్రమేపీ ఏకవ్యక్తి ప్రాబల్యం పెరగడం అసాధారణమేమీ కాదు. అందుకు చైనా భిన్నంగా ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2012లో పగ్గాలు చేపట్టినప్పుడు సామాజిక, ఆర్థిక రంగాల్లో 60 సంస్కరణలు తీసుకొస్తున్నట్టు జిన్‌పింగ్ ప్రకటించారు. వాటి వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో గమనిస్తే మూడోసారి ఆయన్ను నెత్తిన పెట్టుకోవాల్సినంత అగత్యం కనబడదు. ఎందుకంటే ఎగు మతి ఆధారిత ఆర్థిక వ్యవస్థను దేశీయ వినియోగ ఆధారితం చేస్తానన్నది జిన్‌పింగ్ ప్రధాన వాగ్దానం. అదికాస్తా ఎటోపోయింది. ఆర్థిక రంగంలో ఇకపై ‘మార్కెట్ శక్తులకు’ మరింత ప్రాధాన్యతనిస్తామనీ, వనరుల పంపిణీలోనూ వాటికే అగ్రతాంబూలమిస్తామనీ చెప్పినా జరిగింది అందుకు విరుద్ధం. వాస్తవానికి ప్రైవేటు రంగాన్ని మరింత బిగించారు. చైనా బహుళజాతి ఈ– కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా యున్ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. అలీబాబా ఒక దశలో అమెజాన్‌కు దీటుగా కనబడింది. అంతర్జాతీయ వ్యాపార యవనికపై జాక్ తళుకులీనారు. కానీ రుణాలివ్వడంలో చైనా బ్యాంకులనుసరించే ఛాందస ధోరణులను 2020లో నిశితంగా విమర్శించిన కొన్నాళ్లకే ఆయన కథ ముగిసిపోయింది. జాక్ మా ఆ సంస్థ చైర్మన్‌గా తçప్పుకొని ప్రస్తుతం సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. డెంగ్ ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని జిన్‌పింగ్ తొలిసారి అధినేత అయ్యేనాటికి చైనా ఆర్థికంగా మెరుగ్గానే ఉంది. కానీ అది ముందుకు కదలడం లేదు. 7.5 శాతం వృద్ధిరేటు సాధించా లన్న తపన తీరని కలగా మిగిలిపోయింది. ఆర్థిక రంగానికి పెను ఊతం ఇస్తేనే అది పట్టాలెక్కు తుందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అందుకే అప్పట్లో సంస్కరణలపై జిన్‌పింగ్ ఊరిం చారు. కానీ ఆ పనిచేస్తే చివరకు ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు నాయకత్వాన్ని వదలడం లేదని వర్తమాన చైనా తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది. ధనిక, బీద తారతమ్యాలు సరేగానీ... ఆదాయం తగినంతగా ఉన్నవారు కూడా పొదుపు వైపే మొగ్గుతున్నారు. వేరే సంపన్న దేశాల్లో పౌరుల పొదుపు మొత్తం జీడీపీలో గరిష్ఠంగా 33 శాతం ఉండగా, చైనాలో అది 45 శాతం దాటింది. ప్రభుత్వపరంగా సామాజిక భద్రత పథకాలు లేకపోవడం... అనుకోని విపత్తు వస్తే, అవసరాలు ఏర్పడితే ఆసరా దొరకదన్న ఆందోళన అందుకు కారణం. తగినంత వినియోగం లేక పోతే సరుకంతా ఏం కావాలి? వాటిని ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీలు ఏం కావాలి? అనుత్పాదక రుణాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో అవినీతి కూడా మితిమీరిందని తరచు వెలువడే కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికారానికి వచ్చినప్పుడు అవినీతిని చీల్చిచెండాడతానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. ఆ పేరుమీద తన వ్యతిరేకులను అదుపు చేయటం మినహా ఆయన పెద్దగా సాధిం చిందేమీ కనబడదు. ఇక కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ల వినియోగంకన్నా లాక్డౌన్లపైనే ఎక్కు వగా ఆధారపడుతున్న దేశం చైనా. భారీ వ్యయాన్ని తప్పించుకోవడానికి లాక్డౌన్లు అమలు చేస్తున్నా ఇది ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీసింది. ఒకపక్క బీజింగ్‌లో పార్టీ కాంగ్రెస్ మొదలు కాబోతుండగా పారిశ్రామిక నగరం షాంఘైలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంక్షలూ మొదలవుతున్నాయి. ఇది చివరకు లాక్‌డౌన్‌కు దారితీస్తుందేమోనన్న భయం పౌరుల్లో పెరిగింది. తాను విధించుకున్న పరిమితుల్లోనే 140 కోట్ల జనాభాగల చైనాలో సామాజిక సంక్లిష్టతలను అధిగమించడం ఎలా అన్న సంశయం జిన్‌పింగ్‌కు ఉన్నట్టే, దూకుడు ప్రదర్శిస్తున్న చైనాను నియంత్రించడమెలా అన్న చింత పాశ్చాత్య దేశాలకు పట్టుకుంది. ఇండో–పసిఫిక్ కూటమితో దాన్ని దారికి తీసుకురావటంతోపాటు కీలకమైన చిప్ తయారీ సాఫ్ట్వేర్ దానికి దక్కకుండా అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మరో కొత్త పోటీకి దారితీయబోతోంది. గడిచిన సంవత్సరాల్లో చైనా వైఫల్యాలకు, అది ఆశించినంతగా ఎదగకపోవడానికి కారణాలేమిటో జిన్‌పింగ్ తన నివేదికలో వెల్లడిస్తారు. అయితే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏకవ్యక్తిస్వామ్యమే ఇందుకు కారణమని చెప్పేటంత ప్రజాస్వామిక వాతావరణం పార్టీ కాంగ్రెస్‌లో లేదు. వరస వైఫల్యాలను కూడా బేఖాతరు చేసి అదే నేతను పదేపదే అందలం ఎక్కిస్తే జరిగేదేమిటో పొరుగునున్న రష్యాను చూసైనా నేర్చుకోనట్టయితే చైనాకు భవిష్యత్తు ఉండదు. -
మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం మరో కొత్త డ్రామాకి తెరతీసింది. సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా సరిహద్దు భూ చట్టానికి ఆమోదముద్ర వేసింది. చైనా ప్రజల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆ చట్టంలో పేర్కొంది. జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కి చెందిన స్టాండింగ్ కమిటీ శనివారం ఆమోదించినట్టుగా జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే చైనా ఎంతటి చర్యలకైనా దిగుతుందని చట్టంలో ఉంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్ లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది. (చదవండి: చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..) -
బ్రహ్మపుత్రపై చైనా భారీ ప్రాజెక్టు
బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే చైనా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు గురువారం ఆ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (సీపీసీ) ఆమోదించింది. అందులో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ఆమోదించిన బ్లూ ప్రింట్‌ను ఆ దేశ పార్లమెంటు య«థాతథంగా ఆమోదించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కెక్వియాంగ్, 2 వేల మందికి పైగా ఇతర నాయకులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చె డల్హా ఇప్పటికే వెల్ల డించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి సంబం«ధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే ఎత్తయిన నది కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టిబెట్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. జల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. చైనా చర్యలను టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలో భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బ్రహ్మపుత్రపై నిర్మించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో త్రీ గోర్జెస్ కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మెడోగ్ కౌంటీలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 వేల మంది నిరాశ్రయులవుతారని అంచనా. భారత్ ఆందోళనలేంటి? టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్) బ్రహ్మపుత్రపై (యార్లంగ్ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది. దీని నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు. హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపైనా చైనా నియంత్రణ హాంకాంగ్‌పై మరింతగా పట్టు పెంచుకునేలా చైనా అడుగులు ముందుకి వేస్తోంది. అక్కడ ఎన్నికల వ్యవస్థని తన గుప్పిట్లో ఉంచుకునేలా పాట్రియాట్స్ గవర్నింగ్ హాంకాంగ్ తీర్మానాన్ని చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ద్వారా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్య తగ్గి, చైనా అనుకూల ప్యానెల్ తమకు నచ్చినవారిని నామినేట్ చేసే అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజాస్వామ్య స్థాపన కోసం హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణచివేతకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి. ఈ తీర్మానానికి చైనా పార్లమెంటు 2,895–0 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనిని పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మరో పార్లమెంటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా చేసిన తీర్మానాలను అక్కడ పార్లమెంటు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఆమోదిస్తుంది. తీర్మానంపై ఓటు వేస్తున్న జిన్‌పింగ్ -
అంగుళం భూమినీ వదలం
బీజింగ్: చైనా తన భూభాగంలో అంగుళం కూడా ఇతరులకు వదిలిపెట్టబోదని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఏ స్థాయి యుద్ధానికైనా సిద్ధమేనన్నారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) సమావేశాల చివరి రోజు జిన్‌పింగ్ ప్రసంగం దూకుడుగా సాగింది. చైనా జాతికి పునర్వైభవం సాధిద్దామంటూ ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా జాతీయవాదమే కేంద్రంగా.. పొరుగు దేశాలతో సంబంధాలు, ఉయిగుర్ సమస్య, తైవాన్ విలీనం, టిబెట్ తదితర అంశాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్పీసీ సమావేశాల చివరి రోజు సాధారణంగా ప్రధాని మీడియా సమావేశం ఉంటుంది. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగించారు. ఈ సమావేశాల్లో జిన్‌పింగ్ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. జిన్‌పింగ్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజా సేవకుడిని.. ఎన్ని అపరిమిత అధికారాలున్నా సరే, నేను ప్రజా సేవకుడిని. ఎప్పటి మాదిరిగానే వారి కోసం పనిచేస్తా. మన ప్రజలు పట్టుదల గలవారు, ఎవరికీ లొంగరు. స్వాతంత్య్రం కోసం శత్రువులతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉంటారు. మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కృతనిశ్చయంతో ఉందాం. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుదాం. దేశాన్ని విభజించాలనుకునేవారి కుయుక్తులు చెల్లవు. వేర్పాటువాదులకు పరాజయం, శిక్ష తప్పదు. చైనా విస్తరణ వాదాన్ని, ఆధిపత్యాన్ని కోరుకోవటం లేదు. ప్రపంచ రాజకీయాల్లో మనదైన చోటు సంపాదించే అవసరమైన శక్తిసామర్థ్యాలున్నాయి. 170 ఏళ్లుగా ఇందుకోసం పోరాడుతున్నాం. ఈ కల నిజమవుతుందని స్పష్టం చేస్తున్నా. పార్టీదే సర్వాధికారం.. చైనాలో కమ్యూనిస్టు పార్టీయే సుప్రీం. ఇరవై లక్షల సైన్యం, ప్రభుత్వ సంస్థలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. దేశ రాజకీయ నాయకత్వంలో పార్టీదే అత్యున్నత స్థానం. చైనా జాతి గౌరవాన్ని నిలబెట్టి, కాపాడే బాధ్యత కూడా కమ్యూనిస్టు పార్టీదే. జీవిత కాలం అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇది దేశ ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ నాపై పెట్టిన గురుతర బాధ్యత. ఏ హోదాలో ఉన్న వారైనా సరే, ఇది ప్రజల చైనా అనే విషయాన్ని మరువరాదు. జాతి గౌరవాన్ని నిలబెట్టి, మరింత సంపన్నులు, బలవంతులుగా అయ్యేందుకు పట్టుదలతో ప్రజలు ముందుకు సాగుతున్నారు’ అని అన్నారు. భారత్–చీనీ భాయి భాయి భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ఉన్నత స్థాయిలో మరిన్ని సంప్రదింపులు కొనసాగేలా ఆ దేశంతో కలిసి పనిచేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ తెలిపారు. చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు తెలిపేందుకు మంగళవారం ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమన్వయం, సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు, అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా శాంతి, అభివృద్ధి కోసం చైనాతో కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 21వ శతాబ్దం ఆసియాదేనని నిరూపించేందుకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని ఇరువురు అంగీకారానికి వచ్చారు. -
మా అభివృద్ధితో ఎవరికీ హాని లేదు : చైనా
బీజింగ్: తమ దేశ అభివృద్ధితో ఇతర దేశాలకు ఎటువంటి హాని ఉండదని చైనా వెల్లడించింది. చాలా ఏళ్ల తర్వాత చైనా వార్షిక పార్లమెంట్ సమావేశంలో జాతీయ రక్షణ బడ్జెట్ నివేదికను ప్రకటించకపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రక్షణ బడ్జెట్‌ను వాటాల వారీగా ప్రవేశపెట్టేవారు. అయితే ఈ ఏడాది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నూతన అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాంగ్ ఎసుయ్..రక్షణ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. చైనా ఎప్పుడూ శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా జాంగ్ వెల్లడించారు. చైనా ప్రతి ఏడాది తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. గతేడాది చైనా రక్షణ బడ్జెట్ భారత్ కంటే మూడింతలు అధికంగా ఉంది. -
ఉగ్రవాదంపై పోరుకు చైనా కఠిన చట్టం
బీజింగ్: ఉగ్రవాదంపై చైనా ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమైంది. దీన్ని అరికట్టేందుకు తొలిసారిగా కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భావ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని అమెరికా గగ్గోలు పెట్టినా ఖాతరు చేయకుండా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ-పార్లమెంట్) స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానంతో రూపొందించిన ఈ చట్టానికి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆదివారం ఆమోదముద్ర వేసింది. జాతీయ భద్రతా సంస్థలకు తాజా చట్టం విస్తృతమైన అధికారాలు కట్టబెట్టింది. టిబెట్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. అయితే ఈ చట్టం వల్ల ఇబ్బందులు కలుగుతాయని అమెరికా పేర్కొనగా.. తమ వ్యవహారాల్లో జోక్యం తగదంటూ చైనా తిప్పికొట్టింది. చైనాలో తొలి గృహహింస నిరోధక చట్టం చైనా పార్లమెంటు ఆదివారం దేశంలో తొలి గృహహింస చట్టాన్ని ఆమోదించింది. బాధితులకు, సహజీవనం చేసేవారికి దీనికింద న్యాయరక్షణ లభిస్తుంది. మానసిక వేధింపులతోపాటు అన్నిరకాల గృహహింసలను నిషేధించారు. వారం పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఎన్పీసీ స్థాయూ సంఘం దీనికి ఆమోదం తెలిపింది. ప్రజలు రెండో బిడ్డను కనేందుకు ఉద్దేశించిన చట్టాన్ని కూడా పార్లమెంట్ ఆమోదించింది.