rassia
-
ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై క్షిపణిదాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇకపై రష్యా భీకర దాడులు చేయదని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సోమవారం క్షిపణుల వర్షం కురిపించిన తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీ ఆస్తి జరిగింది. క్రెమ్లిన్ బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చినందుకు ప్రతీకారంతో రష్యా ఈ భీకర దాడులకు పాల్పడి మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఐరోపా సమాఖ్య ఈ దాడులను తీవ్రంగా ఖండించి పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు విమర్శించింది. అయితే ఉక్రెయిన్ను సర్వనాశనం చేయడం తమ లక్ష్యం కాదని పతిన్ పేర్కొన్నారు. అందుకే క్షిపణి దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు. పుతిన్ ప్రకటనతో కొద్ది రోజులుగా ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. చదవండి: మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా చనిపోని సైనికుడు -
యుద్ధ లాభం
-
పుతిన్‌కి బలం, బలగం ఇతనే
-
పుతిన్ VS జెలెన్స్కీ
-
రష్యా అమెరికాలకి యుద్ధమే కావాలి
-
ప్రపంచానికే ప్రమాదం
-
బర్గరే బంగారమాయేగా!
-
రష్యా రక్త చరిత్ర
-
ఉక్రెయిన్ నుంచి స్వస్థలాలకు చేరుకున్న ముగ్గురు ప్రకాశం విద్యార్థులు
-
యుద్దానికి ముగింపు..!
-
గోరుచుట్టుపై రోకటి పోటు
-
వెనక్కి తగ్గని రష్యా
-
వన్ వెబ్ ఉపగ్రహాల ప్రయోగాన్ని నిలిపేస్తామన్న రష్యా
-
రాకాసి రష్యా
-
డ్యామిట్ స్టోరీ అడ్డం తిరిగింది
-
రహస్య ప్రదేశానికి పుతిన్ ఫ్యామిలీ
-
రంగం లోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
-
రష్యా పతనం మొదలైంది
-
ఉక్రెయిన్ సరిహద్దులో పరిస్థితి దారుణం
-
ఉక్రెయిన్ లో భారతీయులకు హెచ్చరిక
-
విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్యార్థులు
-
శంషాబాద్ కు చేరుకున్నతెలుగు విద్యార్థులు
-
సీఎం జగన్ గారికి ధన్యవాదాలు
-
బుడాపెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నరెండో విమానం
-
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది తెలుగు విద్యార్థులు
-
గుర్రంలా సకిలించినందుకు జైలుశిక్ష
డోలు.. డోలు కొట్టుకుంటే మధ్యలో ఉన్న మద్దెలను వాయించినట్లు... రష్యాలోని ఓ భార్యభర్తల గొడవ, వీధి ప్రజల నిద్రను మాయం చేసింది. అది కూడా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు. కారణం, రోజూ వారి గొడవలు వినలేక కాదు, గుర్రం సకిలింతలు వినలేక. భార్యభర్తల గొడవల మధ్యలో గుర్రం సకిలింతలు ఏంటని ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ భార్యభర్తలు గొడవపడి, విడిపోయి మూడు సంవత్సరాలు అవుతోంది. కానీ, అతను మాత్రం భార్య తనని వదిలేసి వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోయాడు. ఆ అవమానం, బాధ తట్టుకోలేక కుమిలిపోయాడు. చివరకు మతిస్థిమితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు. అలా సుమారు రెండన్నర సంవత్సరాల పాటు కొనసాగించాడు. అతని బాధ చూడలేక కొంతమంది, అతన్ని మానసికవైద్యశాలలో చేర్పించాలని కూడా చూశారు. ఎటువంటి లాభం లేకపోయింది. దీంతో విసుగు చెందిన వీధి ప్రజలు ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. కోర్టు అతడికి మూడున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించింది. -
కరోనా : రష్యాను దాటనున్న మహారాష్ర్ట
సాక్షి, ముంబై: దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధికంగా మహారాష్ర్టలో కొత్తగా 24,886 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క మహారాష్ర్టలోనే మొత్తం కేసుల సంఖ్య 10,15,681కు చేరుకుంది. కొత్తగా 393 మంది మరణించగా, ఇప్పటివరకు 28,724 మంది కరోనా కారణంగా మరణించినట్లు రాష్ర్ట ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు 20వేలకు పైగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ లెక్కన ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులతో నాల్గవ స్థానంలో ఉన్న రష్యాను తొందర్లోనే దాటేసేలా ఉంది. ఇప్పటి వరకు రష్యాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,51, 874గా ఉంది. అంటే కరోనా కేసుల విషయంలో మహారాష్ర్ట రెండు, మూడు రోజుల్లో రష్యాను దాటేయనుంది. (భారత్: 46 లక్షలు దాటిన కరోనా కేసులు) కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 14,308 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,15,023కు పెరిగింది. రికవరీ రేటు 70.4%గా ఉండగా, మరణాల రేటు 2.83%గా ఉంది. రాష్ర్టంలో ఇప్పటివరకు 50.72 లక్షలమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షలు పెంచడంతో పాజిటివ్ కేసులు సైతం ఎక్కువగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. దేశ జీడీపీలో మహారాష్ర్ట వాట సుమారు 15 శాతం. భారత ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మన్ముందు చాలా కష్టమంటున్నారు ఆర్థిక నిపుణులు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలకు రైలు సేవలు పునఃప్రారంభమైనా, మహరాష్ర్టలో మాత్రం నిలిచిపోయాయి. ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ రైలు సేవలు ప్రారంభిస్తే సెకండ్ వేవ్ మొదలవుతుందని అంచనా. (400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు) -
ముల్లర్‌తో ఇంటర్వ్యూకు ట్రంప్ నో
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి రష్యాతో కలిసి కుట్రపన్నారన్న ఆరోపణలు అర్థరహితమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ వివాదంపై విచారిస్తున్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్, స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ ముల్లర్‌తో ముఖాముఖి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా, రష్యా మధ్య ఎలాంటి సంబంధాల్లేనపుడు దీనిపై విచారణ జరపాల్సిన పనేముంది. నాతో ఇంటర్వ్యూ అవసరమేంటి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత డెమొక్రాట్లు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. 11 నెలలుగా వివిధమార్గాల్లో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2016లో ఈ–మెయిల్ కేసుకు సంబంధించి హిల్లరీ క్లింటన్‌ను ఎఫ్‌బీఐ విచారణ జరిపిన విషయాన్ని మరిచిపోవద్దని ట్రంప్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ట్రంప్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను ముల్లర్ విచారించారు. ట్రంప్‌ను ఇంటర్వ్యూ కోసం ముల్లర్ అపాయింట్మెంట్ కోరుతున్నారంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. -
భార్య కోసం రష్యా నుంచి..
అల్వాల్: భార్యను వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఓ విదేశీయుడికి తీవ్ర నిరాశ మిగిలింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య స్వదేశంలోని పుట్టింటికని మూడు నెలల క్రితం రష్యా నుంచి వచ్చింది. ఆమె నుంచి మూడు నెలలుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురైన భర్త నేరుగా అల్వాల్‌కు వచ్చాడు. అయితే, ఆమె ఆచూకీ లభించలేదు... బాధితుడి కథనం ప్రకారం..... రష్యాలో ఉండే అలెక్స్ కొన్నేళ్ల క్రితం పని నిమిత్తం గోవాకు వచ్చాడు. అదే సమయంలో అల్వాల్‌కు చెందిన సనమ్ కూడా గోవా వెళ్లింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. 2014లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అలెక్స్ భార్య సనమ్‌ను రష్యాకు తీసుకెళ్లాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా.. మూడు నెలల క్రితం భార్య సనమ్ అల్వాల్‌లోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి అలెక్స్ భార్య సనమ్కు ఫోన్ చేస్తే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అలెక్స్ రష్యా నుంచి బుధవారం అల్వాల్‌కు వచ్చి సనమ్ ఇంటికి వెళ్లాడు. సనమ్ ఉండే ఇల్లు అద్దెది కావడంతో అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో ఆమె కోసం అలెక్స్ అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు.