
Russian missile attack: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో నివశిస్తున్న ఉపాధ్యాయురాలు ఒలేనా కురిలో ఇంటిపై రష్యా క్షిపిణి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె రక్తంతో తడిచిన ముఖంతో ప్రాణాలతో బయటపడింది. అంతేకాదు రక్తంతో తడిసిన తన ముఖం తన దేశంపై దాడికి ప్రతీకగా ఉంటుందని ఆమె ఊహించి ఉండుండరు. ఈ మేరకు ఫిబ్రవరి 24న ప్రత్యేక సైనిక చర్యలో భాగంగా వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలని తన దళాలకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో రష్యా బలగాలు భూ, వాయు, జల మార్గాలలో వైమానిక క్షిపణి దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్నాయి. ఇందులో భాగంగానే రష్యా దళాలు ఖార్కివ్ ప్రాంతంలోని చుగెవ్‌తో సహా అనేక ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే చుగేవ్‌లో నివశిస్తున్న ఒలేనా కురిలో ఉపాధ్యాయురాలి ఇంటిపై కూడా క్షిపిణి దాడి జరిగింది.
ఈ మేరకు ఆ దాడి నుంచి రక్తపు ముఖంతో బయటపడిన ఆ మహిళ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆమె మాత్రం అంత బాధలోనూ తన మాతృభూమి కోసం ఏమైనా చేస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు ఉక్రెయిన్ పై రష్యా ఈ విధంగా దాడి చేస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆవేదనగా చెబుతోంది.
తనకు ఉన్నంత శక్తి మేర తన దేశం కోసం ఏమైన చేస్తానని కూడా చెప్పింది. అయితే ఈ ఘటన ఉక్రెయిన్ రాజధాని నగరానికి సుమారు 30 కి.మీ దూరంలో జరిగి ఉండవచ్చని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మరోవైపు వందల సంఖ్యలో రష్యా దళాలు కైవ్‌కు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, మిలియన్ల మంది పౌరులు తమ రాజధాని నగరాన్ని ఏవిధంగానైనా కాపాడుకోవాలని ధృఢంగా నిర్ణయించుకున్నారు.
(చదవండి: తాను సైతం అంటూ... ఆయుధం చేత బట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ!)
Comments
Please login to add a commentAdd a comment