
కీవ్: రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ఆదివారం డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది. వాటిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రిమియా ద్వీపకల్పంలోని సెవస్టోపోల్ తీరపట్టణంపై ఉక్రెయిన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది.
రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు తమకు మరిన్ని ఆయుధాలివ్వాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి కోరారు.