ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం శుక్రవారం ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ నగరంలోని అపార్టుమెంట్లు, ఆటస్థలాల్లో వైమానికి దాడులతో విరుచుకుపడింది. రష్యా బాంబుల దాడిలో ఎడుగురు మృతి చెందగా.. సుమారు 77 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.
బాంబు దాడిలో 12 అంతస్థుల అపార్టుమెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీవ్ నగర మేయర్ వెల్లడించారు. అపార్టమెంట్ శిథిలాల నుంచి ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశామని.. మృత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం ఖర్కీవ్ నగరమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ధ్వంసం అయింది. అయితే ఇటీవల కాలంలో ఖర్కీవ్‌పై రష్యా దాడులు తగ్గినప్పటికీ.. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రేయిన్ సైన్యం చొచ్చుకుపోవటంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment