ఉక్రెయిన్‌ సైన్యం మెరుపు దాడులు.. రష్యాలో ఎమర్జెన్సీ! | Ukrainian Forces Attacks On Russia Belgorod Border | Sakshi
Sakshi News home page

పుతిన్‌ సేనలకు చుక్కలు చూపిస్తున్న​ ఉక్రెయిన్‌.. రష్యాలో ఎమర్జెన్సీ!

Published Wed, Aug 14 2024 6:57 PM | Last Updated on Wed, Aug 14 2024 7:32 PM

Ukrainian Forces Attacks On Russia Belgorod Border

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ​ం మరో స్టేజ్‌కు చేరుకుంది. ఉక్రెయిన్‌ సైన్యం రష్యాను వణికిస్తోంది. రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్‌ సైన్యం కస్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఇ‍క, తాజాగా సరిహద్దుల్లోని బెల్గోరోడ్‌ను టార్గెట్‌ చేసింది. దీంతో, ఆ ప్రాంతంలో రష్యా అధికారులు ఎమర్జెన్సీ విధించారు.

కాగా, ఉక్రెయిన్‌ సేనలు రష్యా భూభాగంలోకి దూసుకెళ్తున్నాయి. రష్యా సైన్యాన్ని వెనక్కి తరుముకుంటూ ఆ దేశంలోకి ఉక్రెయిన్‌ సైన్యం అడుగుపెట్టింది. ఇక, ఇప్పటికే రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్‌ సైన్యం కస్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకొందని ఆ దేశ సైనిక కమాండర్‌ జనరల్‌ ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ వెల్లడించారు. మరోవైపు.. తాజాగా రష్యా సరిహద్దుల్లోని బోల్గోరోడ్‌పై దాడులు మొదలుపెట్టాయి. దీంతో, అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లు అక్కడి గవర్నర్‌ వ్యాచెస్లావ్‌ గ్లాడ్వోక్‌ ప్రకటించారు. దేశంలో ఫెడరల్‌ ఎమర్జెన్సీ విధించాలని తాము కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.

 

 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ సైన్యం ముందుకు వస్తుండటంతో ఇప్పటికే ఇక్కడ పలు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. గత వారం ఉక్రెయిన్‌ సేనలు వ్యూహం మార్చి రష్యా భూభాగంలో ఎదురుదాడులు మొదలుపెట్టాయి. ఇక, రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇతర దేశాల సైన్యం రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక బెల్గోరోడ్‌ ప్రాంతంలో షెబ్‌కినో నగరం, ఉస్టింకా గ్రామాలపై కీవ్‌ సేనలు డ్రోన్‌ దాడులు జరిపాయి.

 

 

అయితే, ఉక్రెయిన్‌ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ స్పందించారు. ఈ క్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందన్నారు. రష్యా రక్షణ శాఖ కూడా ఉక్రెయిన్‌ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్టు ప్రకటించింది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement