శత్రు ట్యాంకులను ఎలా ధ్వంసం చేస్తామంటే! | Anti Tank Guided Missile Squad Of The Indian Army Showed How To Destroy Enemy Tanks In Arunachal | Sakshi
Sakshi News home page

శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!

Published Thu, Oct 21 2021 11:34 AM | Last Updated on Thu, Oct 21 2021 11:41 AM

Anti Tank Guided Missile Squad Of The Indian Army Showed How To Destroy Enemy Tanks In Arunachal - Sakshi

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తైవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌ ఆర్మీకి చెందిన  యాంటీ ట్యాంక్ స్క్వాడ్ బృందం శత్రు ట్యాంకులను ఎలా దాడి చేసి నాశనం చేయాలో పైరింగ్‌ డెమో చేసి చూపిస్తుంది. అంతేకాకుండా అక్కడ పర్వతాలపై దట్టమైన మంచు వ్యాపించి ఉన్న సమయంలో క్షిపిణి ఫైరింగ్‌ ఏవిధంగా చేయాలో, పర్వత శిఖరంపై శత్రు లక్ష్యాన్ని ఎలా చేధించాలో చేసి చూపిస్తోంది. ఈ క్రమంలో  భారీగా సాయుధ బలగాలు పర్వత శిఖరంపై బంకర్ల స్థానాల్లో మోహరించినట్లు కనిపిస్తారు.

(చదవండి: మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!)

అంతేకాదు రహదారిపై శత్రువుల కదిలికలను మంచు కారణంగా సరిగా కనిపించడం లేదన్న ఆ విషయాన్ని కమాండర్‌కి తెలియజేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ సైనికులు బంకర్‌ వద్దకు చేరుకుని క్షణాల్లో యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి(ఏటీజీఎం) ఏర్పాటు చేయడం. తదనంతరం కొండపై ఉన్న మిగతా ఆర్మీ సిబ్బంది సహాయంతో సమాచారం తెలుసుకుంటూ కాల్పులు జరుపుతారు. ఈ క్రమంలో ఒక సైనికుడు ఏటీజీఎం సిస్టమ్‌ని అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఏ విధంగా ఫైరింగ్‌ పోజిషన్‌ తీసుకుంటూ శత్రువులపై కాల్పులు జరపాలో కూడా వివరిస్తుంటాడు.

ఈ మేరకు అధికారులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తైవాంగ్‌ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వెంట పర్వతాలలో అప్‌గ్రేడ్ చేసిన ఎల్‌70 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌, ఎం-777 హోవిట్జర్‌లు, స్వీడిష్ బోఫోర్స్ గన్‌లతో భారత్‌ సైన్యం మోహరించి ఉదని తెలిపారు. అంతేకాదు తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో  చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం తన ఫైర్ పవర్‌ను పెంచడమే  లక్ష్యంగా ఈ డెమో నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భారత​ సైన్యం క్షిపిణి పైరింగ్‌ డెమోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించండి.. 

(చదవండి:  900 ఏళ్ల నాటి పురాతన కత్తి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement