వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.
ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్‌ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో శుక్రవారం చర్చించారు.
కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్‌లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది.
ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు
Comments
Please login to add a commentAdd a comment