మాస్కో: యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిరకాల మిత్రుడు కిమ్ జోంగ్ ఉన్ సాయం కోరుతున్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్నందుకు పశ్చిమ దేశాలు తమపై ఆంక్షాలు విధించిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈమేరకు అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.
ఉత్తర కొరియా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్ వంటివి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఎన్ని ఆయుధాలను రష్యా దిగుమతి చేసుకుందనే విషయాన్ని మాత్రం అమెరికా నిఘావర్గాలు వెల్లడించలేదు. ఆంక్షలు ఉన్నంత కాలం ఉత్తర కొరియా నుంచి రష్యా మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
ఇరాన్ డ్రోన్లు పనిచేయక
ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను వినియెగిస్తోంది రష్యా సైన్యం. అయితే అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలోనే ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఊహించని నష్టం ఎదురైందని, మానవ రహిత విమానాల సంఖ్య భారీగా తగ్గిందని బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలతో రష్యాకు కొరత ఏర్పడిందని పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ.. బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‍కు తమ పరిస్థితి బాగా తెలుసన్నారు. ఐరోపా రాజకీయాల్లో ఆమె కీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఉంటే రష్యా చర్యలను దీటుగా తిప్పికొట్టవచ్చనే విశ్వాసం వ్యక్తం చేశారు.
చదవండి: జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment