artillery
-
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
శతఘ్ని దళాల్లోకి మహిళా అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హౌవిట్జర్, కె–9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాట సహాయక విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పదాతి దళం తర్వాత రెండో అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిస్సైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. పదాతి దళం, శతఘ్ని, మెకనైజ్డ్ శతఘ్ని రెజిమెంట్లలో ఇప్పటి వరకు మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్మీ మార్పులు తెచ్చింది. మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2022లో ఖడక్వాస్లాలోని డిఫెన్స్ అకాడమీలోకి 19 మంది మహిళా కేడెట్లతో మొదటి బ్యాచ్‌కు మూడేళ్ల శిక్షణ ప్రారంభించింది. అయితే, ఇన్ఫాంట్రీ, ఆర్మర్డ్ రెడ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీల్లోకి మహిళా అధికారులను చేర్చుకోవాలన్న ప్రణాళికలేవీ లేవని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్‌తో యుద్ధం.. కొరియా కిమ్‌తో చేతులు కలిపిన పుతిన్!
మాస్కో: యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిరకాల మిత్రుడు కిమ్ జోంగ్ ఉన్ సాయం కోరుతున్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్నందుకు పశ్చిమ దేశాలు తమపై ఆంక్షాలు విధించిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈమేరకు అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఉత్తర కొరియా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్ వంటివి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఎన్ని ఆయుధాలను రష్యా దిగుమతి చేసుకుందనే విషయాన్ని మాత్రం అమెరికా నిఘావర్గాలు వెల్లడించలేదు. ఆంక్షలు ఉన్నంత కాలం ఉత్తర కొరియా నుంచి రష్యా మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ డ్రోన్లు పనిచేయక ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను వినియెగిస్తోంది రష్యా సైన్యం. అయితే అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలోనే ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఊహించని నష్టం ఎదురైందని, మానవ రహిత విమానాల సంఖ్య భారీగా తగ్గిందని బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలతో రష్యాకు కొరత ఏర్పడిందని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌కు తమ పరిస్థితి బాగా తెలుసన్నారు. ఐరోపా రాజకీయాల్లో ఆమె కీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఉంటే రష్యా చర్యలను దీటుగా తిప్పికొట్టవచ్చనే విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి: జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత -
గండికోటలో 8 ఫిరంగి గుండ్లు
సాక్షి, జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో 8 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 18 కేజీలు మరికొన్ని 12 కేజీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గండికోటలో కొన్ని రోజుల నుంచి కోనేరు సమీపం ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నీటి తొట్టి బయటపడింది. అదే రోజు ఒక ఫిరంగి గుండు దొరికింది. శనివారం కూలీలతో పనులు చేయిస్తుండగా.. పూరాతన కాలం నాటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు దొరికిన ప్రదేశం 400 ఏళ్ల నాటివి: గండికోటలో బయటపడ్డ ఫిరంగి గుండ్లు దాదాపు నాలుగు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు, అధికారులు తెలుపుతున్నారు. గండికోట జూమ్మా మసీదు వెనుక వైపు ఆయుధ కర్మాగారంగా ఉండేది. అందులో రాజులకు సంబంధించిన కత్తులతోపాటు, నాణేల ముద్రణ కోసం టంకశాల కూడా ఉండేదని చరిత్ర చెబుతుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పహారా మహాల్ వద్ద ఫిరంగి ఉండగా మరొకటి దక్షిణ వైపులో ఉంది. ఇటీవల బయల్పడిన నీటి కుంట శత్రువులు రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం అప్పట్లో రాజులు కోటకు సంబంధించిన నాలుగు వైపులా బురుజులను ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో ఫిరంగులను ఏర్పాటు చేస్తుండే వారు. ఆ ఫిరంగి గుండ్లను ఉక్కుతో తయారు చేసే వారు. గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని భూగర్భంలో కలిసిపోయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జుమ్మా మసీదు వెనుక వైపు ఉన్న వ్యాయామశాల (తాళింఖానా), ఆయుధ కర్మాగారాలకు సైతం అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. -
సరిహద్దులో పాకిస్తాన్ ఫిరంగులు
ఇస్లామాబాద్: ఉగ్రవాదులపై పోరును ఉధృతం చేసిన పాకిస్తాన్ తాజాగా అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో భారీ ఫిరంగులను మొహరించినట్లు తెలిసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ఈ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా సోమవారం చెప్పారు. పాక్‌లో గతవారం జరిగిన వివిధ ఉగ్రదాడుల్లో 100 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన దాడులకు బాధ్యులైన ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తోందని పాకిస్తాన్ అంటోంది. పాక్ భద్రతా దళాలు 130 మందికి పైగా ఉగ్రవాదులను గతవారంలో హతమార్చాయి. సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్‌లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన మానవబాంబు దాడిలో 80 మంది మరణించగా, మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై పాకిస్తాన్ పోరాటాన్ని ఉధృతం చేసింది. 130 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 350 మందిపైగా అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధికులు అఫ్గానిస్తాన్ పౌరులు ఉండడంతో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఛమన్, తొర్కామ్ జిల్లాల్లో సరిహద్దు వెంబడి భారీ సంఖ్యలో ఫిరంగులు మొహరించింది.