రవి చూడని బ్రిటీష్ పాలన గురించి విని ఉంటారు.. కానీ నేటికీ అక్కడి నిరంకుశ పాలనలో అభివృద్ధికి, టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నారీ దేశ ప్రజలు. అక్కడ పర్యటించాలన్నా, కనీసం మనసును కదిలించిన ఫొటోలు తీసుకోవలన్నా అడుగడుగునా ఆంక్షలే. ఇలాంటి వాటిని కూడా నిషేధిస్తారా అనే అనుమానం కలుగుతుంది ఇది చదివితే.
ఎరిక్ లాఫోర్గ్ ఈ ఫొటోలు తీసినప్పుడు అసలూహించి ఉండడు. కేవలం ఆ ఫొటోలు మూలంగా ఆ దేశం నుంచి శాశ్వతంగా భహిష్కరించబడతాడని. మర్మదేశంగా పేర్కొనే నార్త్ కొరియాకు సంబంధించిన ఫొటోలే అవి. అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ వీటిని తీవ్రంగా వ్యతిరేకించాడట. కిమ్ అనుమతి లేకుండా ఆ దేశానికి సంబంధించి చిన్న చీపురుపుల్ల కూడా ప్రపంచాన్ని చూడదు. అటువంటి అక్కడి పేదరికాన్ని, ప్రజల దుర్భర జీవనాన్ని గురించి ఫొటోలు తీస్తే ఊరుకుంటాడా! అయినప్పటికీ ఆ ఫొటోలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ మాటల్లోనే..
2008 నుంచి ఆరు సార్లు ఉత్తర కొరియాను సందర్శించాను. వాళ్లు నా దగ్గరి ఫొటోలు డిలీట్ చేయమన్నప్పుడు, వాటిని సేవ్ చేసి, డిలీట్ చేశాను. థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా!!
పోషకాహారలోపంతో బాధపడే ఈ విధమైప పిల్లల ఫొటోలు తీయడం ఉత్తర కొరియాలో నిషేధం. అంతేకాదు పేదరికాన్ని తెలియజేసే ఏ విధమైన ఫొటోలు తీయకూడదు.
రాళ్లపై నిద్రపోతున్న ఇతని ఫొటోను కూడా డిలీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో అతను మృతి చెందినట్టు కనిపిస్తున్నాడు.
ఈ ఫొటో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది. దీన్ని కూడా డిలీట్ చేయమన్నారు. పైగా అమెరికా ఆంక్షల వల్లనే కరెంట్ కోతలని చెప్పారు.
పనులకు వెళ్లడానికి గంటల తరబడి సైకిళ్లను తొక్కేవారి ఫొటోలు తీయడం కూడా నిషేధమే.
చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్..
నార్త్ కొరియాలో ప్రతీచోట కనిపించే సైనికులకు సంబంధించిన ఫొటోలు అస్సలు తీయకూడదు. మరీ ముఖ్యంగా ఆగిపోయిన బస్సులను తోసే సమయంలో అస్సలు తీయకూడదు.
క్రమశిక్షణలేని పిల్లల ఫొటోలు కూడా తీయకూడదు. పేదరికంలో మగ్గుతున్నవారి జీవనవిధానాన్ని ఫొటోల్లో బంధించడం అక్కడి చట్టం ప్రకారం నేరం.
వాక్ వే సరిహద్దులను రిపేర్ చేస్తున్న మహిళలు, పిల్లలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు తీయడం కూడా చట్టవిరుద్ధమే.
నాయకుల చిత్రాల ముందు నవ్వుతున్నవారి ఫొటోలు తీయడం అగౌరవంగా భావిస్తారు.
చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
సైనికులు కనిపించకుండా జంతువుల ఫొటోలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఇది పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే ప్రతీచోట పోగయ్యే ప్రజలకన్నా సైనికులే 99 శాతం ఉంటారు.
తినటానికి గడ్డిని సమకూర్చుకునే నార్త్ కొరియన్ ఫొటోలు తీయకూడదు. ఇది కూడా చట్ట విరుద్ధమే.
ప్యోంగ్యాంగ్ రోడ్లపై అరుదుగా కార్లు కనిపిస్తాయి. కార్లు ఓ వైపు వెళ్తున్నారోడ్డు మధ్యలో పిల్లలు ఆడుకుంటారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీయకూడదు.
సాంగ్‌డౌన్‌లో ఎస్కలేటర్‌ను చూసి భయపడుతున్న పిల్లలు వీళ్లు. ఈ దేశ ప్రజల్లో చాలా మందికి అది ఏమిటో కూడా తెలియదు.
మరమ్మత్తులు అవసరమైన ఈ పాత బిల్డింగ్, ఆహారం కోసం చేపలు పట్టే వ్యక్తి, కాలుష్యంతో నిండిన నదిలో స్నానం చేసే వ్యక్తి, గుండీలు ఊడిన వ్యక్తి ఫొటోలు, విశ్రాంతి తీసుకునే సైనికులు, నిరాశ్రయులైన వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, మురికి దుస్తులతో ఉన్న వ్యక్తుల ఫొటోలు తీయడం అక్కడి చట్టం ప్రకారం నేరం.
చాలా మటుకు నార్త్ కొరియా దేశంలో పేరదికమే కనిపిస్తుంది. ఇతర ప్రపంచదేశాలు తమను తక్కువచేసి చూస్తారనే భయం, ఆంధోళన అక్కడి నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిరంకుశ పాలన పరాకాష్టకు చేరితే ఉత్తర కొరియాలా ఉంటుందనడానికి ఈ ఫొటోలపై ఉన్న నిషేధమే నిదర్శనం.
చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..
Comments
Please login to add a commentAdd a comment